PERIYALWAR SATTUMORA HELD_ శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో ఘ‌నంగా శ్రీ పెరియాళ్వార్ సాత్తుమొర‌

Tirupati, 11 Jul. 19: One among the 12 Alwars, the ardent saint devotees of Sri Vaishnavaism, Sri Periyalwar Sattumora was held in Sri Govindaraja Swamy temple on Thursday.

In the morning snapana tirumanjanam was held to deities of Sri Govindaraja Swamy, Sridevi and Bhudevi along with Periyalwar utsava murthies from the holy waters brought from Narasimha Theertham.

In the evening when Sri Govindaraja was taken on a celestial ride on Garuda Vahana while Periyalwar on Gaja Vahanam.

EO Sri Anil Kumar Singhal took part in the Garuda seva. Later he inspected the development works in the temple along with CE Sri Chandra Sekhar Reddy, FACAO Sri Balaji and other officials.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో ఘ‌నంగా శ్రీ పెరియాళ్వార్ సాత్తుమొర‌

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా శ్రీ పెరియాళ్వార్‌ సాత్తుమొర

ఆలయంలో ఈవో పరిశీలన

జూలై 11, తిరుపతి, 2019: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీలక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో గురువారం శ్రీ పెరియాళ్వార్‌ సాత్తుమొర ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన గరుడ వాహనసేవలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ పాల్గొన్నారు.

ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు ఉదయం శ్రీ లక్ష్మీ నారాయణస్వామివారి ఆలయానికి వేంచేపు చేశారు. ఈ సందర్భంగా తిరుపతిలోని శ్రీనరసింహతీర్థం నుండి తిరుమంజనం తీర్థాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామి, అమ్మవార్లతోపాటు శ్రీ పెరియాళ్వార్‌కు వేడుకగా స్నపనతిరుమంజనం చేపట్టారు. సాయంత్రం శ్రీ గోవిందరాజ స్వామివారు గరుడ వాహనంపై, శ్రీ పెరియాళ్వార్‌ గజ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు.

శ్రీ మహావిష్ణువుకు పెరియాళ్వార్‌ పరమభక్తుడు. శ్రీ ఆండాళ్‌ అమ్మవారికి ఈయన తండ్రి. శ్రీ పెరియాళ్వార్‌ తులసిమాలలు కట్టి ప్రతిరోజు స్వామివారికి సమర్పించేవారు. తండ్రితో పాటు ఆరాధించిన ఆండాళ్‌ అమ్మవారు చివరకు స్వామివారినే భర్తగా భావించారు. శ్రీ పెరియాళ్వార్‌ ఎన్నో పాశురాలను రచించి స్వామివారికి అర్పించారు. ఈయనకు శ్రీమహావిష్ణువు సాక్షాత్కారం జరిగినట్టు అర్చకులు తెలిపారు.

ఆలయంలో ఈవో పరిశీలన

టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ఈ సందర్భంగా ఆలయం ఎదురుగా గల బుగ్గ, టికెట్‌ కౌంటర్లు, అద్దాల మహల్‌, హెడ్ కౌంట్ యంత్రాలు త‌దిత‌రాలను పరిశీలించారు. బుగ్గ మ‌ర‌మ్మతు ప‌నుల‌ను ప‌రిశీలించి ప‌లు సూచ‌న‌లు చేశారు. టికెట్‌ కౌంటర్లపై విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులకు సూచించారు. ఆల‌యంలో వైర్లు వెలుప‌లికి క‌నిపించ‌కుండా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని, నూత‌న సూచిక‌బోర్డులు ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎఫ్‌ఏ,సిఏవో శ్రీ బాలాజి, ఎస్‌ఇలు శ్రీ రాములు, శ్రీ వేంకటేశ్వర్లు, డిఇలు శ్రీ చంద్రశేఖర్‌, శ్రీ రవిశంకర్‌రెడ్డి, ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఇవో శ్రీ రవిప్రకాష్‌రెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీజ్ఞానప్రకాష్‌, శ్రీ శ్రీహరి, ఎవిఎస్‌వో శ్రీ నందీశ్వర్‌రావు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ కృష్ణమూర్తి, శ్రీ ప్రశాంత్‌, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.