PERIYALWAR UTSAVAM FROM JUNE 26 TO JULY 25 _ జూన్‌ 26 నుండిజూలై 05వతేదీవరకుశ్రీపెరియాళ్వార్‌ఉత్సవం

Tirupati, 21 June 2025: Periyalwar Utsavam will be observed in Sri  Lakshmi Narasimha Swamy temple, a sub temple of Sri Govindaraja Swamy temple in Tirupati from June 26 to July 05.

Every day, both the Pontiffs of Tirumala will recite Pasurams in Periyalwar Sannidhi. On the last day, Tirumanjanam will be performed. In the evening of the last day, Sri Govindaraja will ride on Garuda vahanam while Sri Periyalwar on Gaja Vahanam to bless devotees.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

జూన్‌ 26 నుండి జూలై 05 తేదీ వరకు శ్రీ పెరియాళ్వార్‌ ఉత్సవం

తిరుపతి, 2025, జూన్ 21: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి అనుబంధంగా వున్న శ్రీలక్ష్మీ నారాయణ స్వామి వారి ఆలయంలో జూన్‌ 26 నుండి జూలై 05వ తేదీ వరకు శ్రీ పెరియాళ్వార్‌ ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నారు.

ఇందులో భాగంగా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌ స్వామి తమ శిష్యబృందంతో కలిసి శ్రీలక్ష్మీ నారాయణ స్వామి వారి ఆలయంలోని శ్రీ పెరియాళ్వార్‌వారి సన్నిధిలో ప్రబంధ పాశురాలను నివేదిస్తారు. చివరి రోజైన జూలై 05వ తేదీ ఉదయం శ్రీ పెరియాళ్వార్‌కు తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం శ్రీగోవిందరాజస్వామివారు గరుడ వాహనంపై, శ్రీ పెరియాళ్వార్‌ గజ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.

శ్రీ మహావిష్ణువుకు పెరియాళ్వార్‌ పరమభక్తుడు. శ్రీ ఆండాళ్‌ అమ్మవారికి ఈయన తండ్రి. శ్రీ పెరియాళ్వార్‌ తులసిమాలలు కట్టి ప్రతిరోజు స్వామివారికి సమర్పించేవారు. తండ్రితో పాటు ఆరాధించిన ఆండాళ్‌ అమ్మవారు చివరకు స్వామివారినే భర్తగా భావించారు. శ్రీ పెరియాళ్వార్‌ ఎన్నో పాశురాలను రచించి స్వామివారికి అర్పించారు. ఈయనకు శ్రీమహావిష్ణువు సాక్షాత్కారం జరిగినట్టు అర్చకులు తెలిపారు.

తి.తి.దే., ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.