PHALGUNA LAKSHMI VAIBHAVAM OBSERVED WITH RELIGIOUS GRANDEUR _ లోక క‌ల్యాణార్థం ఫాల్గున ల‌క్ష్మీ వైభ‌వం – ల‌క్ష్మీ జ‌యంతి : టిటిడి ఈవో డా.కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

HUNDREDS OF WOMEN TAKE PART FOLLOWING COVID NORMS

 DANCE BALLET FOCUSSING BIRTH OF LAKSHMI DEVI STEALS THE SHOW

 HUNDREDS OF GHEE LIT LAMP ENHANCE THE BEAUTY OF FULL MOON ON THE AUSPICIOUS PHALGUNA POURNAMIL

Tirupati, 28 Mar. 21: In connection with Lakshmi Jayanti, Phalguna Lakshmi Vaibhavam was observed by TTD and SVBC on Sunday evening with utmost spiritual fervour. The parade Grounds of TTD donned a complete new look on Sunday evening with the illumination emerged out of hundreds of ghee lit lamps.

To overcome the ill effects caused due to Covid 19 Virus across the world, TTD has been observing various Vedic and religious activities from the past one year. The community events like Karthika Deepotsavam, Dhanurmasa Vishnu Pujanam, and Maghamasa Visesha Puja etc. with the participation of the public. 

In the sacred Phalguna Masa, on the auspicious day of Phalguna Pournami, a unique Phalguna Lakshmi Vaibhavam event was celebrated to commemorate the birth of Sri Lakshmi Devi on a pleasant evening under the full moon daylight.

SERIES OF EVENTS

The fete began at 6pm with Vedic Scholar Dr PV Chalapathi briefing on the significance of the festival. He also explained on Lakshmi Jayanthi and also recited Maha Lakshmi Astakam. 

After the introduction, Veda Swasti followed with the chanting of Sri Suktam hymns by Sri Yajulu, Sri Purushottamacharyulu. Later Maha Lakshmi Puja performed by scholars Dr GV Subramanya Sharma, Dr GV Phaniraja Shastry, Dr S Sitarama Rao, and Dr AV Bharadwaja from Sri Venkateswara Vedic University.

DANCE PERFORMANCE CYNOSURE

The dance ballet on Sri Maha Lakshmi Avirbhavam by the students of SV College of Music and Dance under the guidance of Dr M Muddubala stood as a cynosure. The excellent portrayal of different deities with Lakshmi emerging out of the Samudra Madhanam episode stole the limelight. The background score music rendered by Dr K Vandana added flavour to the ballet.

SAMUHIKA DEERADHANAM

The artists of the Annamacharya Project by senior artist Sri G Madhusudhan Rao and his team of artistes rendered Govinda Namas. The women devotees who participated in the religious event lit ghee lamps and offered Samuhika Deeparadhanam. 

SVBC LIVE

The entire event was telecasted live by SVBC and the drone camera effect enhanced the beauty of the ghee lit lamps. 

MANGALA HARATI

The event came to a grand event with Mangala Harati with the Annamacharya Project artistes rendering the famous keertana “Ksheerabdi Kanyakaku. Sree Maha Lakshmikini…Neeraja Layamunaku… Neerajanam” with melody.

STUDENTS FELICITATED

Students who performed the dance ballet were felicitated by TTD EO Dr KS Jawahar Reddy.

DEVOTEES EXPRESS IMMENSE SATISFACTION 

Women devotees who participated in the event lauded TTD for the perfect execution of the programme with finesse. After Deeparadhana, each devotee is presented with a Tulasi plant and packet containing a blouse piece, two kankanams, Mini Tirumala Laddu and Tiruchanoor laddu as prasadam.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI 

లోక క‌ల్యాణార్థం ఫాల్గున ల‌క్ష్మీ వైభ‌వం – ల‌క్ష్మీ జ‌యంతి : టిటిడి ఈవో డా.కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

తిరుప‌తి‌, 2021 మార్చి 28: సృష్ఠిలోని స‌క‌‌ల జీవ‌రాశులు ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని, లోక క‌ల్యాణార్థం స్వామి, అమ్మ‌వార్ల‌ను ప్రార్థిస్తూ ఫాల్గున ల‌క్ష్మీ వైభ‌వం – ల‌క్ష్మీ జ‌యంతిని నిర్వ‌హించిన‌ట్లు టిటిడి ఈవో డా.కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నం ప‌రేడ్ మైదానంలో ఆదివారం రాత్రి ల‌క్ష్మీ జ‌యంతి పూజ కార్య‌క్ర‌మం అత్యంత వైభ‌వంగా జ‌రిగింది. ఈ పూజ‌లో 1000 మందికి పైగా మ‌హిళ‌లు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ టిటిడి హిందూ ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో ఇప్ప‌టివ‌ర‌కు నిర్వ‌హించిన కార్తీక‌, ధ‌నుర్‌, మాఘ మాస ఉత్స‌వాల‌కు భ‌క్తుల నుండి విశేషాద‌ర‌ణ ల‌భించింద‌న్నారు. శ్రీ మ‌హాలక్ష్మీ అమ్మ‌వారు పుట్టిన రోజున‌ భక్తులు అమ్మ‌వారిని పూజించ‌డం ద్వారా కోరిన కోర్కెలు నెరవేరుతాయ‌ని, ఆధ్యాత్మిక జ్ఞానం, మానసిక, ఆధ్యాత్మిక శాంతిని అమ్మ‌వారు ప్రసాదిస్తార‌ని పురాణాలు చెబుతున్నాయ‌ని వివ‌రించారు. వంద‌లాది మంది మ‌హిళ‌లు కార్య‌క్ర‌మం చివ‌ర‌న సామూహిక ల‌క్ష్మీనీరాజ‌నం పేరుతో దీపాల‌ను వెలిగించి శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు, అమ్మ‌వారిని క‌రోనా వైర‌స్‌ను ద‌హించి వేసి ప్ర‌పంచ మాన‌వాళికి ఆరోగ్యాన్ని ప్ర‌సాదించాల‌ని ప్రార్థించ‌ర‌న్నారు.

ఇందులో భాగంగా సాయంత్రం 5 నుండి 6 గంట‌ల వ‌ర‌కు అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు శ్రీ మ‌ధుసూధ‌న‌రావు బృందం అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల‌ను మ‌ధురంగా అల‌పించారు. అనంత‌రం శ్రీ డిపివైయాజులు, శ్రీ పురుషోత్త‌మాచార్యులు శ్రీసూక్త‌నామంతో వేద‌స్వ‌స్తి కార్య‌క్రమాన్ని నిర్వ‌హించారు. త‌రువాత తిరుమ‌ల ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం అధ్యా‌ప‌కులు డాక్ట‌ర్ పి.వి.చ‌ల‌ప‌తి ల‌క్ష్మీ జ‌యంతి ప్రాశ‌స్త్యాన్ని తెలియ‌జేశారు. ఎస్వీ వేద వ‌ర్సిటీ ఆచార్యులు జివి సుబ్ర‌మ‌ణ్య‌శ‌ర్మ‌, డా. జివి ఫ‌ణిరాజ‌శాస్త్రీ, డా. ఎస్‌.సీతారామారావు, డా.ఏవిఆర్ భ‌ర‌ద్వాజ్ గ‌ణ‌ప‌తి పూజ‌, శ్రీ మ‌హాల‌క్ష్మీపూజ‌ను వేదోక్తంగా నిర్వ‌హించారు. అనంత‌రం డాక్ట‌ర్ పి.వి.చ‌ల‌ప‌తి మ‌హాల‌క్ష్మాష్ట‌కం స్తోత్ర‌ప‌ఠ‌నం చేశారు.

త‌రువాత ఎస్వీ సంగీత‌, నృత్య క‌ళాశాల అధ్యాప‌కులు శ్రీ‌మ‌తి ముద్ధుబాల‌ బృందం నృత్య‌రూప‌కాన్ని అద్భుతంగా ప్ర‌ద‌ర్శించారు. ఈ ప్రదర్శన ఎంతో ఆకట్టుకుంది. అనంత రం పండితులు చెబుతున్న మంత్రాన్ని ప‌ఠిస్తూ మ‌హిళ‌లందరూ సామూహికంగా దీపాలు వెలిగించారు.

ల‌క్ష్మీ జ‌యంతి సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన దీపోత్స‌వంలోని దీపాలను చూడ‌డం వ‌ల్ల కీట‌కాలు, జంతువులు, చెట్లు, సామాన్య మాన‌వులు, పండితులు పున‌ర్జ‌న్మ లేకుండా మోక్షాన్ని పొందుతార‌ని పండితులు తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి సతీమణి శ్రీమతి స్వర్ణలత , ఎస్వీ వేద వ‌ర్సిటీ ఉప‌కుల‌ప‌తి ఆచార్య స‌న్నిధానం సుద‌ర్శ‌న శ‌ర్మ‌, ఎస్వీబీసీ సిఈవో శ్రీ జి.సురేష్‌కుమార్‌, విజివో శ్రీ మ‌నోహ‌ర్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు

టిటిడి ఉన్నతాధికారులతోపాటు, మహిళలందరూ నేతిదీపాలు వెలిగించారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.