PILGRIMS SHOULD FOLLOW COVID GUIDELINES _ యాత్రికులు కోవిడ్ నిబంధనలు పాటించాలని టిటిడి విజ్ఞప్తి

TIRUMALA, 31 JULY 2021: As the Central and State Governments, Medical Experts, Scientists are hinting at the possibility of third wave of Covid likely, TTD appealed to devotees visiting Tirumala to follow prescribed guidelines without deviation.

As some devotees are roaming in the open places in Tirumala without wearing masks, moving in masses, not using Sanitizers which are against Covid guidelines, TTD has appealed to its devotees strictly to follow the guidelines.

All the pilgrim influx areas, local temples, TTD Administrative Building etc. are directed to strictly follow Covid norms.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

యాత్రికులు కోవిడ్ నిబంధనలు పాటించాలని టిటిడి విజ్ఞప్తి

తిరుమల, 2021 జులై 31: కరోనా మూడో దశ(థర్డ్ వేవ్)కు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న సూచనలను దృష్టిలో ఉంచుకుని తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న యాత్రికులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని , తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. కొంతమంది యాత్రికులు బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకుండా సంచరిస్తుండడం సమంజసం కాదు. ఈ కారణంగా తోటి యాత్రికులు ఇబ్బంది పడుతున్నారు.

ఈ నేపథ్యంలో యాత్రికులు విధిగా మాస్కులు ధ‌రించి భౌతిక‌దూరం పాటించాలని, శానిటైజ‌ర్ వినియోగించాలని కోరడమైనది.

తిరుమలలో యాత్రికుల రద్దీ ప్రాంతాలు, టిటిడి స్థానికాలయాలు, తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనం తదితర ప్రాంతాల్లో విధిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేయడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.