PREZ OFFERS PRAYERS IN SRI KT _ శ్రీ కపిలేశ్వరస్వావారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి గౌ.. శ్రీ రామ్‌నాథ్ కోవింద్
Tirupati, 13 July 2019 : H. E. the Honourable President of India Sri Ramnath Kovind offered prayers in the famous Lord Shiva shrine of Sri Kapileswara Swamy at Tirupati on Saturday evening.
On his arrival at the entrance of the temple, he was received by Tirupati JEO Sri P Basanth Kumar and was accorded with the traditional Purnaphala Swagatham.
Later he had darshan of the presiding deity of Sri Kapileswara Swamy, Sri Kamakshi Ammavaru in the ancient temple. The first citizen of the Nation also took part in the Deepaaraadhana Seva.
JEO TPT Sri Basanth Kumar Temple, Temple DyEO Sri Subramanyam was also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ కపిలేశ్వరస్వావారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి గౌ.. శ్రీ రామ్‌నాథ్ కోవింద్
తిరుపతి, 2019 జూలై 13తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారిని భారత రాష్ట్రపతి గౌ.. శ్రీ రామ్‌నాథ్ కోవింద్ దంపతులు శనివారం సాయంత్రం దర్శించుకున్నారు. గౌ.. గవర్నరు శ్రీ ఇఎస్ఎల్.నరసింహన్ దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముందుగా ఆలయం వద్దకు చేరుకోగానే టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్ కుమార్, అర్చకులు కలిసి పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీ కపిలేశ్వరస్వామి దర్శనానంతరం గౌ.. రాష్ట్రపతి దంపతులు నవగ్రహ మండపంలో పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ భరత్ గుప్తా, మదనపల్లి సబ్ కలెక్టర్ శ్రీమతి కీర్తి, అర్బన్ ఎస్పి శ్రీ అన్బురాజన్, టిటిడి అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్ రెడ్డి, విఎస్వో శ్రీ అశోక్ కుమార్ గౌడ్, డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ రాజ్‌కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.