PAVITRA PRATISTA AT KT_ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా పవిత్రోత్సవాలు ప్రారంభం

SACRED PAVITRA MALAS FETE

Tirupati, 13 Jul. 19: As a part of annual Pavitrotsavams in Sri Kapileswara Swamy temple in Tirupati, Pavitra Pratista was observed on Saturday.

These sacred garlands spun out of holy threads will be offered to the deities on Sunday.

Earlier Snapanam was observed to the Deities of Sri Somaskandamurthy, Sri Kamakshi Ammavaru, Sri Vighneshwara Swamy, Valli Devasena Sametha Sri Subrahmanya Swamy, Sri Chandikeswara.

Later in the evening Paitra Pratista observed in Yagashala.

Temple DyEO Sri Subramanyam and other office staffs were also present.


BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా పవిత్రోత్సవాలు ప్రారంభం

జూలై 13, తిరుపతి, 2019: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ‌నివారం పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం చేశారు. ఉదయం 9 నుండి 12 గంటల వరకు పంచమూర్తులైన శ్రీసోమస్కందమూర్తి, శ్రీకామాక్షి అమ్మవారు, శ్రీవిఘ్నేశ్వరస్వామి, వళ్లి దేవసేన సమేత శ్రీసుబ్రమణ్యస్వామి, శ్రీచండికేశ్వరస్వామివార్ల ఉత్సవర్లకు కల్యాణ మండపంలో స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, విభూది, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.

సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు పవిత్రోత్సవ కార్యక్రమాలు నిర్వ‌హిస్తారు. ఇందులో భాగంగా కలశపూజ, హోమం, పవిత్ర ప్రతిష్ట‌ చేపడతారు. రూ.500/- చెల్లించి ఇద్దరు గృహస్తులు పవిత్రోత్సవంలో పాల్గొనవచ్చు. ఈ సేవలో పాల్గొన్న గృహస్తులకు ఒక లడ్డూ, ఉత్తరీయం, రవికె, చివరి రోజు పవిత్రమాలలు బహుమానంగా అందజేస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈఓ శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ రాజ్‌కుమార్‌, అర్చ‌కులు శ్రీ ఉద‌య‌శంక‌ర్ గురుకుల్‌, శ్రీ స్వామినాథ గురుకుల్‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ రెడ్డిశేఖ‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.