PRIORITY TO RESEARCH AND DEVELOPMENT AT BIRRD HOSPITAL- TTD EO _ బర్ద్ లో పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలి : టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి

Tirupati, 22 July 2021: The Balaji Institute of Surgery, Research and Rehabilitation for the Disabled should focus on prioritizing Research and Development in Orthopaedic medicine, said TTD Executive Officer Dr. KS Jawahar Reddy.

During a review meeting held on BIRRD activities in his chamber at TTD Administrative Building in Tirupati on Thursday he directed upon officials of BIRRD hospital to set up a separate unit for treatment of children in ailments like Polio, Bone corrections, Scoliosis and cerebral palsy.

He asked officials to utilise the extended OP section set up during Covid season to utilize for treating Trauma and cerebral cases. He also suggested that the waiting period for all surgeries be reduced to less than three months only.

He urged officials to make full use of the unique software app for integrated maintenance of the hospital by training all staff members. The TTD EO said the purchase of the entire hospital equipment should be routed through the common procurement cell and reviewed the tender bids that were already called for purchases.

Directing engineering officials to complete all the civil works, he also advised the officers to upscale infrastructure to increase the bed strength of the BIRRD hospital from existing 150 to 350 beds whenever needed.

The TTD EO also inspected the construction of the Paediatric hospital underway within the BIRRD complex.

Additional EO and MD of BIRRD Sri AV Dharma Reddy, FA and CAO Sri O Balaji, IT in charge Sri Sesha Reddy, CMO Dr Muralidhar, RMO Sri Sesha Shailendra, BIRRD OSD Dr Reddappa Reddy and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

బర్ద్ లో పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలి : టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి

తిరుపతి 22 జూలై 2021: బర్ద్ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ అంశాలకు సంబంధించి పరిశోధనకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

పరిపాలన భవనం లోని తన చాంబర్లో గురువారం ఆయన బర్ద్ ఆసుపత్రి పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, చిన్న పిల్లలకు సంబంధించి పోలియో, బోన్ కరెక్షన్, స్కోలియోసిస్, సెరబ్రిల్ పాలసీ తదితర వాటి కోసం ప్రత్యేకంగా యూనిట్ ఏర్పాటు చేయాలని సూచించారు. కోవిడ్ 19 తగ్గుముఖం పట్టాక ప్రారంభించిన ఓపిలో ట్రామా, సెరిబ్రిల్ కేసులకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ఆపరేషన్ల వెయిటింగ్ పీరియడ్ మూడు నెలల దాకానే ఇవ్వాలని ఈవో చెప్పారు. ఆసుపత్రి సమగ్ర నిర్వహణ కోసం తయారు చేసిన హాస్పియో రామ సాఫ్ట్ వేర్ ను పూర్తిస్థాయిలో ఉపయోగించాలన్నారు. టీటీడీ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఈ సాఫ్ట్ వేర్ ఉపయోగం పై శిక్షణ ఇవ్వాలని చెప్పారు. పరికరాల కొనుగోలు కామన్ ప్రొక్యూర్ మెంట్ సెల్ ద్వారానే జరగాలన్నారు. వివిధ పరికరాల కొనుగోలు కోసం పిలిచిన టెండర్లు పై సమీక్షించారు. బర్ద్ లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 150 బెడ్లను అవసరమైతే 350 దాకా పెంచేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. సివిల్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

అంతకు ముందు ఆయన బర్ద్ ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మిస్తున్న చిన్న పిల్లల ఆసుపత్రి పై అధికారులతో సమీక్షించారు.

అదనపు ఈవో, బర్ద్ ఎండి శ్రీ ధర్మారెడ్డి, ఎఫ్ఏ అండ్ సిఎవో శ్రీ బాలాజి, ఐటి ఇంచార్జ్ శ్రీ శేషారెడ్డి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మురళీధర్, ఆర్ఎమ్ఓ శ్రీ శేష శైలేంద్ర , ఆసుపత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ రెడ్డెప్ప రెడ్డి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.