AGED AND PHC DARSHA9N ON JAN 8 AND 22_ జనవరి 8న వృద్ధులు, దివ్యాంగులకు, 9న చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం

PARENTS WITH CHILDREN BELOW 5YEARS ON JAN 9 AND 23

Tirumala, 5 Jan. 19: In the month of January the special privileged darshan for aged and physically challenged is on 8 and 22 while those of parents with children below 5years is on 9 and 23.

To provide hassle free darshanam to aged (above 65y), physically challenged and parents with children below 5years of age, TTD has been giving special privileged darshanam during lean period in a year since last August. Two days during off season month are earmarked for this category of darshanam.

On January 8 and 22, in all together 3 slots 4000 tokens will be issued to aged and PHC citizens without making them to wait for hours in queue lines.

Similarly on January 9 and 23, the parents with children below 5years of age will be allowed for darshanam between 9am and 1.30am on those days through Supatham entry. The devotees falling under this category are requested to make use of this facility.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

జనవరి 8న వృద్ధులు, దివ్యాంగులకు, 9న చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం

జనవరి 05, తిరుమల 2019: శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు టిటిడి సంతృప్తికరంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రతినెలా రెండు సామాన్య దినాల్లో వీరికి ప్రత్యేక దర్శనాలు కల్పిస్తోంది.

ఇందులోభాగంగా జనవరి 8వ తేదీన వయోవృద్ధులు(65 సం|| పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లను టిటిడి జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ల వద్ద వృద్ధులు, దివ్యాంగులకు ప్రతిరోజూ 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఇక్కడ ఉదయం 7 గంటల నుండి ప్రారంభించి రెండు స్లాట్లకు సంబంధించిన టికెట్లు కేటాయిస్తారు. కావున భక్తులు ముందుగా వచ్చి టికెట్ల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఆ తరువాత ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తారు.

5 సంవత్సరాలలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను జనవరి 9వ తేదీన ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సుపథం మార్గం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో ఒక సంవత్సరం లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తారు. భక్తుల కోరిక మేరకు ఐదేళ్లలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను ఈ రెండు రోజుల్లో సుపథం మార్గం ద్వారా అనుమతిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.