SRAVANAM SERVICES SHOULD REACH MANY NEEDY-TTD CHAIRMAN_ శ్రవణం సేవలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లండి : టిటిడి ఛైర్మన్‌ శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌

Tirupati, 5 Jan. 19: The Trust Board Chief of TTD Sri P Sudhakar Yadav while complimenting the services of Sravanam Project of TTD, strongly felt that it’s services should reach more needy.

On Saturday, the Chairman made a surprise visit to Sravanam Project in Tirupati and verdiend various activities. He also inspected the facilities that are being offeren to the hearing impaired children, their mothers and teaching faculty in the building.

Later speaking to media persons he said, this was one of the most worthy projects of TTD that was commenced on December 15 in 2006 to transform the hearing impaired children to lead a normal life in the society.

“All the teachers are doing impeccable services to train deaf children. “If the parents would ante to recognize the problem on day one soon after the birth of their child, Sravanam project offers best services. It is always easy to cute deafness among children below 5years”, he opinioned.

Deputy EO Smt Bharathi, AVSO Sri Rajesh and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

శ్రవణం సేవలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లండి : టిటిడి ఛైర్మన్‌ శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌

జనవరి 05, తిరుపతి 2019: శ్రీవేంకటేశ్వర వినికిడిలోప నిర్ధారణ మరియు శిక్షణ సంస్థ(శ్రవణం)లో జరుగుతున్న చక్కటిసేవలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ కోరారు. టిటిడి ఆధ్వర్యంలో తిరుపతిలో గల శ్రవణం ప్రాజెక్టును శనివారం ఛైర్మన్‌ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఛైర్మన్‌ మీడియాతో మాట్లాడుతూ వినికిడిలోపం ఉన్న పిల్లలకు తొలిదశలోనే శిక్షణ ఇస్తే వినికిడిలోపాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు. 0 నుండి 3 ఏళ్లలోపు వయసు గల వినికిడిలోపం ఉన్న చిన్నారులను ఇక్కడ చేర్చుకుని 8 దశల్లో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారని తెలిపారు. పిల్లలకు వయసుకు తగ్గట్టు చదవడం, రాయడం, చిత్రలేఖనం, గణితం, సాంఘిక, సామాన్య శాస్త్రాలపై శిక్షణ ఇస్తారని వివరించారు. శిక్షణ కాలం పూర్తయ్యే వరకు పిల్లలతోపాటు తల్లి లేదా సంరక్షురాలికి ఉచితంగా వసతి, భోజనం, వైద్యం కల్పిస్తామన్నారు. పిల్లలు చేరగానే 2 వినికిడి యంత్రాలను, శిక్షణ పూర్తయ్యాక 2 బిటి హియరింగ్‌ యంత్రాలను అందిస్తున్నారని చెప్పారు. డిసెంబరు 15, 2006న 15 మంది పిల్లలు, ఇద్దరు ఉపాధ్యాయులతో ప్రారంభమైన ఈ సంస్థలో ప్రస్తుతం 152 మంది విద్యార్థులు, 28 మంది ఉపాధ్యాయులు, 28 మంది సిబ్బంది ఉన్నారని తెలియజేశారు.

అనంతరం, మరింత ఎక్కువ మంది పిల్లలకు వినికిడి జ్ఞానాన్ని ప్రసాదించేందుకు శ్రవణం ప్రాజెక్టు గురించి ఎస్వీబీసీలో ప్రత్యేక కథనాలు, స్క్రోలింగ్‌ ప్రసారం చేయాలని, కరపత్రాలు, గోడపత్రికలు, హోర్డింగుల ద్వారా ఎక్కువ మందికి తెలిసేలా ప్రచారం చేయాలని ఛైర్మన్‌ అధికారులను ఆదేశించారు. అంతకుముందు శిక్షణ పొందుతున్న చిన్నపిల్లలను తరగతులవారీగా పరిశీలించారు. వారి తల్లులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వెంకటగిరికి చెందిన చిన్నారి తల్లి శ్రీమతి లక్ష్మీ మాట్లాడుతూ తాము పిల్లలకు జన్మనిస్తే, శ్రవణం ప్రాజెక్టు వినికిడి జ్ఞానాన్ని ప్రసాదించి పునర్జన్మ ఇచ్చిందని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో టిటిడి డెప్యూటీ ఈవో శ్రీమతి కె.భారతి, ఎవిఎస్‌వో శ్రీ రాజేష్‌, శ్రవణం ప్రాజెక్టు ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.