PRIVILEGE DARSHANS BY TTD_ జూలై 10, 24వ తేదీల్లో వృద్ధులు, దివ్యాంగులకు, జూలై 11, 25వ తేదీల్లో చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం

Tirumala, 8 July 2018: The privilege darshan to aged.and specially abled by TTD will be on July 10 and 24 while for parents with children below five years on July11 and 25.

Since last August TTD has been implementing this darshan on any two days of a month during lean season.

It may be mentioned here that TTD has cancelled privilege darshan in May and June in view of heavy summer rush.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

జూలై 10, 24వ తేదీల్లో వృద్ధులు, దివ్యాంగులకు, జూలై 11, 25వ తేదీల్లో చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం

జూలై 08, తిరుమల 2018: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం ఎక్కువ మంది వమో వృద్ధులు, దివ్యాంగులకు జూలై 10, 24వ తేదీలలో, 5 సంవత్సరాలలోపు చంటి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు జూలై 11, 25వ తేదీలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి అనుమతిస్తారు.

తిరుమలలోని ఎస్వీ మ్యూజియం ఎదురుగా వయో వృద్ధులు (65 సం||ల పైన)వారికి, శారీరక, మానసిక వైకల్య సమస్యలున్నవారికి టిటిడి సకల సౌకర్యాలు ఏర్పాటుచేసి సంతృప్తికరంగా శ్రీవారి దర్శనం కల్పిస్తోంది. ఇందుకోసం ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. ఈ కౌంటర్ల వద్ద వృద్ధులు, దివ్యాంగులు కూర్చునేందుకు బెంచీలు ఏర్పాటుచేశారు. ఇక్కడినుండి 2 బ్యాటరీ వాహనాలు, ఒక వ్యాన్‌ ద్వారా వృద్ధులు, దివ్యాంగులను దక్షిణ మాడ వీధి వద్దగల వేచి ఉండే హాళ్లకు తరలిస్తారు. వేచి ఉండే హాళ్లలో నిరంతరాయంగా పాలు, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు.

ఇక్కడ వ్యక్తిగతంగా ఫొటో తీసుకోవడంతోపాటు ఆధార్‌ లేదా ఓటర్‌ గుర్తింపుకార్డును నమోదు చేసుకుంటారు. రాయితీపై రూ.20/-కి రెండు లడ్డూలు, రూ.70/-కి నాలుగు లడ్డూలు కొనుగోలు చేయవచ్చు. వేచి ఉండే హాళ్ల నుండి ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా దర్శనానికి పంపుతారు. నడవలేనివారికి శ్రీవారి సేవకులను సహాయకులుగా పంపుతారు. ఆధార్‌ లేదా ఓటరు గుర్తింపు కార్డుతో టోకెన్‌ పొంది శ్రీవారి దర్శనం చేసుకున్న వృద్ధులు, దివ్యాంగులను తిరిగి 90 రోజుల తరువాత మాత్రమే ఈ ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా దర్శనానికి అనుమతిస్తారు.

5 సంవత్సరాలలోపు చంటి పిల్లలను, వారి తల్లిదండ్రులను జూలై 11, 25వ తేదీల్లో ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు సుపథం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో ఒక సంవత్సరంలోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తున్నారు. భక్తుల కోరిక మేరకు ఐదేళ్లలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను ఈ రెండు రోజుల్లో సుపథం మార్గం ద్వారా అనుమతిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.