PROCESSION HOLY ITEMS HELD_ వరలక్ష్మీ వ్రతానికి భ‌క్తుల‌కు సౌక‌ర్య‌వంతంగా ఏర్పాట్లు : టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌

Tiruchanoor, 8 Aug. 19: In connection with Varalakshmi Vratam at Sri Padmavathi Ammavari temple in Tiruchanoor on Friday, the procession of holy items was held on Thursday evening.

Sri P Basant Kumar, Tirupati JEO carried the sacred items to beget the blessings of Padmavathi Ammavaru. Speaking on this occasion, the JEO said among the important Hindu festivals, Varalakshmi Vratam is one such ones especially in Sravana month.

He also said after the Varalakshmi Vratam the turmeric, vermilion, bangles etc. Will be distributed to women devotees.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వరలక్ష్మీ వ్రతానికి భ‌క్తుల‌కు సౌక‌ర్య‌వంతంగా ఏర్పాట్లు : టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌

తిరుపతి, 2019 ఆగస్టు 08: భార‌తీయులు అత్యంత భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో నిర్వ‌హించే ప‌ర్వ‌దినాల్లో ఒక‌టైన వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తాన్ని శుక్ర‌వారం తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో ఘ‌నంగా నిర్వ‌హిస్తామ‌ని, ఇందుకోసం భ‌క్తుల‌కు సౌక‌ర్య‌వంతంగా ఏర్పాట్లు చేప‌ట్టామ‌ని టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్ కుమార్ తెలిపారు. వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం ఏర్పాట్ల‌ను గురువారం సాయంత్రం జెఈవో ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా సౌభాగ్యం సామ‌గ్రికి ఆల‌యంలో పూజ‌లు నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ భ‌క్తుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని ఆల‌యంలో ప్ర‌త్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. ఆల‌యంలో, ఆస్థాన మండ‌పంలో వివిధ ర‌కాల పుష్పాల‌తో స‌ర్వాంగ సుంద‌రంగా అలంక‌ర‌ణ చేప‌ట్టామ‌న్నారు. భ‌క్తుల సౌక‌ర్యార్థం ఆస్థాన మండ‌పంలో 4, ఊంజ‌ల్ మండ‌పంలో 1, తోళ‌ప్ప‌గార్డెన్‌లో 1 క‌లిపి మొత్తం 6 ఎల్ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేశామ‌న్నారు. హెచ్‌డిపిపి ఆధ్వ‌ర్యంలో సౌభాగ్యం పేరిట ప‌సుపు, కుంకుమ‌, గాజులు, ల‌క్ష కంక‌ణాలు పంపిణీ చేస్తామ‌న్నారు. ఉద‌యం 10 నుండి 12 గంట‌ల వ‌ర‌కు జ‌రిగే వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తాన్నిఎస్వీబీసీ ద్వారా ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తామ‌ని తెలిపారు.

జెఈవో వెంట ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమ‌తి ఝాన్సీరాణి, హెచ్‌డిపిపి కార్య‌ద‌ర్శి డా. ర‌మ‌ణ‌ప్ర‌సాద్ ఇత‌ర అధికారులు ఉన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.