“PROVIDING HYGIENIC, HEALTHY AND AFFORDABLE FOOD TO DEVOTEES IS OUR ULTIMATE GOAL”-TTD EO _ శ్రీవారి భక్తులకు సరసమైన ధరలతో పరిశుభ్రమైన, రుచికరమైన ఆహారాన్ని అందించాలి• టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామల రావు
FSD TO TRAIN ANNAPRASADAM STAFF AND HOTELIERS ON FOOD SAFETY STANDARDS
BIG AND JANATA CANTEENS GIVEN TIME TO REVAMP TILL AUGUST 5
TIRUMALA, 26 JULY 2024: The ultimate goal of TTD is to provide hygienic, healthy and tasty food to the multitude of visiting pilgrims to Tirumala at affordable and reasonable prices and to reach this objective the Food Safety Department authorities will train the TTD Annaprasadam staff, hoteliers and other vendors on Food Safety measures soon, said TTD EO Sri J Syamala Rao.
An awareness meeting to the Big and Janata Canteens in Tirumala with the Food Safety Department authorities was held in the presence of TTD EO at the Conference Hall of Gokulam Rest House on Friday.
The Director of Food Safety Department Sri Purnachandra Rao has given a detailed PowerPoint Presentation on the Food Safety Management System that included the Hygienic and Sanitary practices to be followed in all the restaurants and eateries in Tirumala, Physical-Chemical-Biological Hazards of food spoilage, storing, wastage disposal plan, violation punishments in Food Safety Laws and Acts, training to the hoteliers and workers with Food Safety Training and Certification (FoSTaC) which is a large scale training programme that is very much required for the food business operators and many other related topics.
After the PPP, the EO said, all the Big and Janata Canteens operators will be given to revamp their hotel atmosphere as per the Food Safety Standards till August 5. “All the hotels should display the price list of the recipes without fail. After the given time, if any hotel is found violating the norms, serious action will be initiated”, he asserted.
The EO also said, the APTDC-run hotels should enhance the hygiene, quality and quantity of their recipes in such a way that they should be role model to other canteens and hotels in Tirumala. He said, very soon even the small hotel operators and vendors will also be trained on food safety methods by the FSD authorities. “Our ultimate goal is to provide hygienic, healthy and tasty food to the multitude of visiting pilgrims to Tirumala at affordable and reasonable prices”, he maintained.
JEO Sri Veerabrahmam, DyEO Health Smt Asha Jyothi, Additional HO Dr Sunil Kumar, DyEO PandR Smt Vijayalakshmi, Catering Special Officer Sri GLN Shastry and others participated.
Among others, Sri Venkateswara Rao, Assistant Food Controller and other FSD representatives, APTDC Divisional Manager Sri Giridhar Reddy, Big and Janata Canteens operators in Tirumala were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి భక్తులకు సరసమైన ధరలతో పరిశుభ్రమైన, రుచికరమైన ఆహారాన్ని అందించాలి
• ఆహార భద్రత ప్రమాణాలపై అన్నప్రసాదం సిబ్బంది మరియు హోటల్ యజమానులకు శిక్షణ
• పెద్ద మరియు జనతా క్యాంటీన్‌లలో ప్రమాణాలను మెరుగుపరుచుకునేందుకు ఆగస్టు 5వ తేదీ వరకు సమయం
• ప్రతి హోటల్ లో ధరల పట్టిక తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి
• టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామల రావు
తిరుమల, 2024 జూలై 26: తిరుమలకు వచ్చే భక్తులకు సరసమైన ధరలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన ఆహారాన్ని అందించడమే టీటీడీ లక్ష్యమని ఈవో శ్రీ జె. శ్యామలరావు చెప్పారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఫుడ్ సేఫ్టీ విభాగంవారు అన్నప్రసాదం సిబ్బందికి, పెద్ద మరియు జనతా క్యాంటీన్‌ల నిర్వాహకులకు త్వరలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రతి హోటల్ లో ధరల పట్టికను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, ప్రమాణాలను మెరుగుపరుచుకునేందుకు ఆగస్టు 5వ తేదీ వరకు సమయం ఇస్తున్నట్లు ఆయన తెలియజేశారు.
తిరుమల గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో శుక్రవారం టీటీడీ ఈవో, ఫుడ్ సేఫ్టీ శాఖ అధికారులతో తిరుమలలోని పెద్ద, జనతా క్యాంటీన్‌లపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ శ్రీ పూర్ణచంద్రరావు, ఫుడ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌పై సవివరమైన పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌ను అందించారు. ఇందులో తిరుమలలోని అన్ని రెస్టారెంట్లు మరియు తినుబండారాల తయారీదారులు అనుసరించాల్సిన పరిశుభ్రత మరియు పారిశుద్ధ్య పద్ధతులు తెలిపారు. ఆహారం చెడిపోవడం వల్ల కలిగే భౌతిక-రసాయన-జీవ ప్రమాదాలు, ముడి సరుకులు నిల్వ చేసే పద్ధతులు, వృధా నిర్మూలన ప్రణాళిక, ఆహార భద్రత చట్టాలు మరియు చట్టాలలో ఉల్లంఘన శిక్షలు తెలియజేశారు. ఆహార వ్యాపార నిర్వాహకులకు చాలా అవసరమైన ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ (FOSTAC) శిక్షణా సంబంధిత విషయాలు వివరించారు.
ఈ సమావేశంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవోలు శ్రీమతి ఆశాజ్యోతి, శ్రీమతి విజయలక్ష్మి, ఇంచార్జ్ ఆరోగ్యశాఖ అధికారి డా. సునీల్ కుమార్, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శ్రీ జీఎల్‌ఎన్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ శ్రీ వెంకటేశ్వరరావు, తిరుమల ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీ జగదీష్, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఇతర ప్రతినిధులు, ఎపిటిడిసి డివిజనల్ మేనేజర్ శ్రీ గిరిధర్ రెడ్డి, తిరుమలలోని పెద్ద మరియు జనతా క్యాంటీన్ల నిర్వాహకులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.