PUBLIC AWARENESS ON BANNED AMMUNITION_ తిరుమలకు పేలుడు సామగ్రి నిషేధంపై విస్తృత ప్రచారం : టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకే రవికృష్ణ

Tirumala, 6 December 2017: To spread awareness among the pilgrims who are coming from far off states across the county, the CVSO of TTD Sri A Ravikrishna on Wednesday stated that carrying ammunition and weapons are prohibited in Tirumala.

This assumed importance in the wake of few instances which occurred in recent past where in the vigilance wing and SPF personnel of TTD have recovered pistols and bullets from pilgrims at Alipiri tollgate while checking in their vehicles at different occasions. To avoid such incidents in future, the vigilance and security wing of TTD felt the need to enlighten masses in a big way by spreading awareness campaign.

The pilgrims are informed not to carry unlicensed weapons and ammunition to Tirumala which are strictly prohibited. If in the case a pilgrim carries licensed weapon and ammunition, should declare the same along with the license at Alipiri check point for documentation purpose failing which will be liable for legal action.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

తిరుమలకు పేలుడు సామగ్రి నిషేధంపై విస్తృత ప్రచారం : టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకే రవికృష్ణ

డిసెంబరు 06, తిరుపతి, 2017: పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలకు లైసెన్సు లేని ఆయుధాలు, పేలుడు సామగ్రిని తీసుకెళ్లకూడదని, దీనిపై దేశవ్యాప్తంగా దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అవగాహన కల్పించేందుకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని టిటిడి ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ ఆకే రవికృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఇటీవల భక్తులు తమ వాహనాల్లో నిషేధిత ఆయుధాలను తీసుకెళుతుండగా అలిపిరి చెక్‌ పాయింట్‌ వద్ద టిటిడి విజిలెన్స్‌, ఎస్‌పిఎఫ్‌ సిబ్బంది తనిఖీలు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారని వివరించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా భక్తులకు అవగాహన కల్పించాలని నిర్ణయించినట్టు తెలియజేశారు.

లైసెన్సు గల ఆయుధాలు, పేలుడు సామగ్రి ఉన్న పక్షంలో అలిపిరి చెక్‌ పాయింట్‌ వద్ద వాటికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని, లేనిపక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సివిఎస్‌వో వెల్లడించారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.