ADHYAYANOTSAVAMS IN TIRUMALA TEMPLE FROM DEC 18_ డిసెంబరు 18 నుంచి 2018, జనవరి 11వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు

Tirumala, 6 December 2017: As per the TTD almanac, the annual adhyayanotsavams in Tirumala temple will commence on December 18 and will be observed for 25-days up to 11th of January 2018.

IMPORTANCE: The recitation of Nalariya Divya Prabandha Pasurams(4000 couplets) penned by 12 Alwars, the ardent saintly persons of Sri Vaishnava in the auspicious month of Dhanurmasa. Every day the Sri Vaishnava pundits render pasurams in Ranganayakula mandapam. This fete commences eleven days before Vaikuntha Ekadasi in Tirumala temple and the first eleven days are known as Pagalpattu and the next ten days are called Rapattu.

On 22nd day Kanninun Siruttambu, 23rd day Ramanuja Nutrandadi, 24th day Sri Varahaswamy Sattumora and on final day Tanniramudu utsavam will be observed.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

డిసెంబరు 18 నుంచి 2018, జనవరి 11వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు

డిసెంబరు 06, తిరుమల, 2017: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 18 నుండి 2018 జనవరి 11వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. సాధారణంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందుగా శ్రీవారి సన్నిధిలో దివ్యప్రబంధ అధ్యయనంగా పిలిచే ఈ అధ్యయనోత్సవం ప్రారంభమౌతుంది.

ఈ సందర్భంగా శ్రీవైష్ణవ జీయంగార్లు స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను గోష్ఠిగానం చేస్తారు. ఆళ్వార్‌ దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను 25 రోజుల పాటు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీవైష్ణవులు పారాయణం చేస్తారు.

కాగా, తొలి 11 రోజులను పగల్‌పత్తు అని, మిగిలిన 10 రోజులను రాపత్తు అని వ్యవహరిస్తారు. 22వ రోజున కణ్ణినున్‌ శిరుత్తాంబు, 23వ రోజున రామానుజ నూట్రందాది, 24వ రోజున శ్రీవరాహస్వామివారి సాత్తుమొర, 25వ రోజున తణ్ణీరముదు ఉత్సవంతో అధ్యయనోత్సవాలు పూర్తవుతాయి.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.