NEW WEB APPLICATION FOR TTD PUBLICATIONS-JEO_ టిటిడి ప్రచురణలను ప్రభుత్వ, వర్సిటీల గ్రంథాలయాలకు అందించాలి : తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

Tirupati, 6 September 2018: Tirupati JEO Sri P Bhaskar instructed the concerned officials to prepare a separate web applications for TTD publications.

A review meeting on the preservation, sales of TTD publications was held in the chambers of Tirupati JEO in TTD administrative building on Thursday.

The JEO said, the quality of the publications should be good and should be supplied to Government Libraries of the state. He also instructed that the Sapthagiri magazine reach the subscribers on time.

FACAO Sri Balaji, Chief Editor Sapthagiri Dr Radharamana, Sales wing DyEO Sri Hemachandra Reddy were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

టిటిడి ప్రచురణలను ప్రభుత్వ, వర్సిటీల గ్రంథాలయాలకు అందించాలి : తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

తిరుపతి, 2018 సెప్టెంబరు 06: టిటిడి ప్రచురణలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు విశ్వవిద్యాలయాలు, ఇతర గ్రంథాలయాలకు అందించాలని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల జెఈవో కార్యాలయంలో గురువారం నాడు అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ భద్రపరచడం కోసం, విక్రయించడం కోసం, భద్రపరచడం మరియు విక్రయించడం కోసం అనే మూడు ప్రాధాన్యాలుగా టిటిడి ప్రచురణలను విభజించాలన్నారు. ఆన్‌లైన్‌లో పొందగోరే దాతల కోసం ప్రత్యేకంగా అప్లికేషన్‌ను రూపొందించాలని సూచించారు. లక్షల మంది పాఠకులకు చేరేందుకు వీలుగా ఉచితంగా పుస్తకాలను అందించే ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లను సంప్రదించాలన్నారు. పాఠకుల అభిరుచికి అనుగుణంగా కంటెంట్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. పుస్తక ముద్రణలో కాగితం, బైండింగ్‌ నాణ్యతను పరిగణనలోకి తీసుకోవాలని, పుస్తకాల ధరను సిఏవో నిర్ణయిస్తారని తెలిపారు. ముద్రణ పూర్తయిన పుస్తకాలను ప్రణాళికాబద్ధంగా మార్కెటింగ్‌ చేయాలన్నారు.

ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్నవారికి సప్తగిరి మాసపత్రిక అందని పక్షంలో, ఫోనులో సంప్రదించి చిరునామాలు సేకరించి పత్రిక అందేలా చూడాలని జెఈవో ఆదేశించారు. మరింత ఎక్కువ మంది భక్తులకు సప్తగిరి మాసపత్రిక అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ సమావేశంలో టిటిడి ఎఫ్‌ఏ,సిఏవో శ్రీ ఓ.బాలాజి, చీఫ్‌ ఎడిటర్‌ డా|| రాధారమణ, సేల్స్‌ వింగ్‌ డెప్యూటీ ఈవో శ్రీహేమచంద్రారెడ్డి, ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి డా||ఆంజనేయులు, ప్రెస్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ శ్రీ ప్రభాకర్‌, ఉపసంపాదకుడు డా|| నొస్సం నరసింహాచార్య తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.