PURANDHARA DASA ARADHANA OBSERVED _ నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లో మైమ‌ర‌పించిన దాసప‌దాల‌ సంకీర్త‌నాగానం

Tirumala, 29 January 2025: As a part of the ongoing three-day Sri Purandhara Dasa Aradhana Mahotsavams, Dasa Padagalu were rendered in front of Sri Bhu sameta Sri Malayappa Swamy on Wednesday evening.

On the occasion of the Aradhana fete of the 15th Century Kannada Saint Poet Sri Purandhara Dasa, every year after Sahara Deepalankara Seva, the Utsava deities reaches the Narayanagiri Gardens on the second evening of the three-day fete in Tirumala.

On Wednesday, over 3500 Bhajan devotees hailing from AP, TS, Karnataka, Tamilnadu participated in this programme and the entire premises echoed with Govinda Nama Smarana.

The Dasa artistes rendered versatile  Sankeertans and immersed the devotees in the devotional vibes.

Additional EO Sri Ch Venkaiah Chowdary, DASA Sahitya Special Officer Sri Ananda Theerthacharyulu and others, devotees in large numbers were also present.

After the completion of the programme, the utsava deities returned to the temple.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లో మైమ‌ర‌పించిన దాసప‌దాల‌ సంకీర్త‌నాగానం

తిరుమల, 2025 జ‌న‌వ‌రి 29: తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాలు బుధవారం సాయంత్రం శ్రీ పురందరదాసులవారి కీర్తనలతో మారుమోగాయి. శ్రీ పురందరదాసులవారి ఆరాధన మహోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. ముందుగా శ్రీవారు ఉభయదేవేరులతో కలిసి నారాయణగిరి ఉద్యానవనాలకు వేంచేపు చేశారు. ఈ సంద‌ర్భంగా చల్లటి సాయంత్రం వేళ నిర్వ‌హించిన ఊంజ‌ల్‌సేవ‌లో దాస సంకీర్తనల గానం భక్తులను మైమరపింపచేసింది.

టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో దాస భక్తులు సామూహికంగా పురందరదాస కృతులను ఆలపించారు.

టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, దాససాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు, ఇతర అధికారులు, 3,500 మందికి పైగా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక చెందిన భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.