PURUSAIVARI TOTOTSAVAM HELD IN TIRUMALA _ తిరుమలలో ఘనంగా పురశైవారితోటోత్సవం

Tirumala, 06 MARCH 2022: Purusaivari Tototsavam was observed with religious fervour on Sunday in Tirumala in connection with 968th Avatarotsavam of Sri Anantazwan.

 

This unique religious fete is associated to Sri Anantazhwan, an ardent devotee of Sri Venkateswara Swamy who attained salvation.

 

The great Sri Vaishnavaite Anantazhwan(1053AD) pioneered Pushpa Kainkaryam for the first time in Tirumala temple.

 

His descendants of 26th generation rendered Nalayira Divya Prabandha Gosti Parayanam after performing pujas in Purusaivari Tota on the auspicious occasion.

 

HH Tirumala Pedda Jeeyar, HH Tirumala Chinna Jeeyar Swamijis, All Projects of TTD Program Officer Sri Vijayasaradhi and others were present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

తిరుమలలో ఘనంగా పురశైవారితోటోత్సవం

తిరుమల, 2022 మార్చి 06: శ్రీ వైష్ణవ భక్తాగ్రేసరుడు, ఆళ్వారులలో ప్రముఖుడైన శ్రీ అనంతళ్వారు 968వ అవతారోత్సవం తిరుమలలోని అనంతాళ్వార్‌తోటలో (పురశైవారితోట) ఆదివారంనాడు టిటిడి అత్యంత ఘనంగా నిర్వహించింది. ఈ సందర్బంగా సుమారు 300 లకు పైగా అనంతళ్వారు వంశీకులు ”నాలాయిర దివ్యప్రబంధ గోష్ఠిగానం” నిర్వహించారు.

ఈ సందర్భంగా తిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ పెరియకోయిల్‌ కేల్వి అప్పన్‌ శ్రీ శఠగోప రామానుజ పెద్దజీయర్‌స్వామి అనుగ్రహ భాషణం చేస్తు తన 102 ఏళ్ళ సుదీర్ఘ జీవన ప్రస్థానంలో స్వామివారికి పుష్పకైంకర్యాన్ని ప్రారంభించి ఉద్దరించిన శ్రీ వైష్ణవ భక్తాగ్రేసరుడు శ్రీ అనంతాళ్వార్‌ని కొనియాడారు. అనంతాళ్వారు వంశీకులుగతకొన్ని దశాబ్దాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం ముదావహం అన్నారు.

తిరుమల శ్రీశ్రీశ్రీ గోవిందరామానుజ చిన్నజీయర్‌స్వామివారు మాట్లాడుతూ 968 సంవత్సరాల క్రితం శ్రీ రామానుజాచార్యులవారు స్వామి కైంకర్యాన్ని క్రమబద్దీకరించడానికి తన శిష్యబృదంలో ఎవరైన ఉన్నారా అని అడిగినప్పుడు అనంతళ్వారు ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఆయన తిరుమలలో వివిధ రకాల సుగంధభరిత పుష్పాల మొక్కలతో తోటను ఏర్పరచి స్వామివారి పుష్ప కైంకర్యాన్ని ప్రారంభించి తన జీవితాన్ని భగవంతుని సేవకు సమర్పించుకున్నారని వివరించారు.

అనంతరం కాంచిపురం శ్రీ మనవాల జీయర్‌ శ్రీశ్రీశ్రీ వడికేశరి అల‌గియ‌స్వామి ఆనంతాళ్వార్‌ జీవిత వైశిష్ట్యం గురించి అనుగ్రహబాషణం చేశారు.

ఈ సంద‌ర్భంగా వివిధ శ్రీవైష్ణవ దివ్య దేశాల‌నుండి వ‌చ్చిన 15 మంది శ్రీ వైష్ణ‌వ పండితులు ఆళ్వార్ దివ్య ప్ర‌బంధ ప‌ఠ‌నం చేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడిలోని అన్ని ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రాం అధికారి శ్రీ విజయ సారథి, ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు అధికారి శ్రీ పురుషోత్తం, అనంతాళ్వార్‌ వంశీకులు శ్రీ రంగాచార్యులు, శ్రీ గోవిందాచార్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.