CJI OFFERS PRAYERS IN TIRUMALA TEMPLE _ తిరుమలలో శుభ్రత, సుందరీకరణ చాలా బాగున్నాయి – సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌.వి.ర‌మ‌ణ‌

PRAISES THE CLEANLINESS, HYGIENE AND BEAUTIFICATION WORKS IN TIRUMALA

 

COMPLIMENTS TTD ON RESUMING SARVA DARSHANAM AFTER TWO YEARS

 

TIRUMALA, 06 MARCH 2022:The Honourable Chief Justice of India, Justice NV Ramana has offered prayers along with his family on Sunday morning in Tirumala temple.

 

Earlier on his arrival at MahaDwaram, he was welcomed with traditional Isthikaphal and received by TTD Chairman Sri YV Subba Reddy, EO Dr KS Jawahar Reddy, Additional EO Sri AV Dharma Reddy.

 

After darshan, he was offered Vedaseervachanam followed by presentation of Theertha Prasadams along with the recently released book on Anjanadri – Hanuman Janmasthalam by Chairman and EO.

 

Later speaking to media persons, the CJI said it is great to know that Sarva Darshan has  resumed for pilgrims almost after a gap of two years. “I prayed Sri Venkateswara Swamy to save the world ensuring that Covid like diseases will never recur in future again”, he maintained.

 

He also appreciated the recent initiatives taken by TTD including beautification of Tirumala environs along with hygiene.

 

Later he also had darshan of Sri Bedi Anjaneya Swamy and offered prayers at Akhilandam too along with his family.

 

Local legislator Sri B Karunakar Reddy, CVSO Sri Gopinath Jatti, DyEOs Sri Harindranath, Sri Lokanatham, VGO Sri Bali Reddy and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

తిరుమలలో శుభ్రత, సుందరీకరణ చాలా బాగున్నాయి
– రెండేళ్ల తరువాత సామాన్య భక్తులకు సర్వదర్శనం కల్పించడం సంతోషం

– సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌.వి.ర‌మ‌ణ‌

తిరుమల, 2022 మార్చి 06: తిరుమల లో శుభ్రత, సుందరీకరణ చాలా బాగున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మెచ్చుకున్నారు. రెండేళ్ల తరువాత రోజూ వేలాదిమంది సామాన్య భక్తులకు సర్వదర్శనం భాగ్యం కల్పించడం సంతోషకరమన్నారు. ఆదివారం ఉదయం శ్రీవారి ని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు. శ్రీవారి ఆశీస్సులు అందుకుని భక్తులు ఆనందించే వాతావరణం ఏర్పడిందన్నారు. భవిష్యత్తు లో కోవిడ్ లాంటి వ్యాధులు సోకకుండా ప్రపంచాన్ని కాపాడాలని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఆయన ప్రార్థించారు.

శ్రీవారి సేవలో….

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయం వద్దకు వచ్చిన జస్టిస్ రమణను చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి అహ్వానించగా, అర్చక బృందం ”ఇస్తికఫాల్‌” మర్యాదలతో స్వాగతం పలికారు. అనంత‌రం ఆయ‌న ధ్వజస్తంభానికి నమస్కరించి శ్రీవారిని దర్శించుకున్నారు.

రంగనాయకుల మండపంలో చీఫ్ జస్టిస్‌కు పండితులు వేద ఆశీర్వాదం చేశారు. చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్
కె ఎస్ జవహర్ రెడ్డి, ఆదనవు ఈవో శ్రీ ధర్మారెడ్డి శ్రీ ఎన్‌వి. రమణకు స్వామివారి తీర్థ ప్రసాదాలు, ఆంజనేయుని జన్మస్థలం పై టీటీడీ ముద్రించిన పుస్తకం అందజేశారు.

శ్రీవారి దర్శనం అనంతరం జస్టిస్ ఎన్‌వి.రమణ దంపతులు శ్రీ బేడీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. తరువాత అఖిలాండం వద్ద కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టారు.

తిరుప‌తి శాసన సభ్యులు శ్రీ భూమన కరుణాకర రెడ్డి, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, డెప్యూటీ ఈవోలు శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, శ్రీ లోక‌నాథం, విజివో శ్రీ బాలిరెడ్డి పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.