PURUSHAIVARI THOTA UTSAVA HELD IN TIRUMALA _ తిరుమ‌ల‌లో శ్రీ ఆండాళ్‌ తిరువడిపురం శాత్తుమొర

Tirumala, 11 August, 2021:TTD grandly organized the Purusaivari Tota Utsavam at Tirumala as part of Sri Andal Ammavari Tiruvadipuram Shattumora on Wednesday.

According to puranic legends the emergence of Sri Andal Goda Devi who is believed to be an incarnation of Bhudevi occurred at Tulasi Gardens on the Purva Phalguni Nakshatram in the month of Ashada on the day of Shukla Chaturthi.

On the holy occasion, the utsava idols of Sri Malayappa Swami along with His two consorts Sridevi and Sri Bhudevi arrived at the Purusaivari Tota in the evening in a procession after the Sahara Deepalankara seva. Here special Harati, garlands and Shatari will be offered to the holy Pogada tree followed by Abhishekam.

Thereafter the Utsava idols of Swami and His consorts shall return to Srivari temple.

Srivari temple DyEO Sri Ramesh Babu, OSD Sri Pala Sheshadri were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమ‌ల‌లో శ్రీ ఆండాళ్‌ తిరువడిపురం శాత్తుమొర

తిరుమలలో బుధవారం శ్రీ ఆండాళ్‌ తిరువడిపురం శాత్తుమొర జరిగింది.

తిరుమల, 2021 ఆగస్టు 11: సాయంత్రం స‌హ‌స్ర‌దీపాలంకార సేవ అనంత‌రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు పురుశైవారితోటకు వేంచేపు చేశారు. అక్కడ నివేదనల అనంతరం స్వామి, అమ్మవార్లు బయల్దేరి పొగడ చెట్టు వద్దకు రాగానే హారతి ఇచ్చారు. శేషహారతి, పుష్ప మాల‌, శ్రీ శఠారి పొగడ చెట్టునకు సమర్పించారు. శ్రీ శఠారికి అభిషేకం అనంతరం తిరిగి తిరుచ్చిపై ఉంచారు. అక్కడినుంచి స్వామి, అమ్మవార్లు తిరిగి ఆలయ మాడ వీధుల గుండా ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు.

పురాణాల ప్రకారం పాండ్య దేశంలో పరమ విష్ణుభక్తుడైన శ్రీ విష్ణుచిత్తుడికి చెందిన తులసీవనంలో ఆషాడ శుక్ల చతుర్థి నాడు పూర్వఫల్లునీ నక్షత్రంలో భూదేవి అంశగా ఆండాళ్‌(గోదాదేవి) అమ్మవారు ఆవిర్భవించారు. ఈ కారణంగా కటక మాసం పూర్వఫల్గుని నక్షత్రంలో ఆండాళ్‌ తిరువడిపురం శాత్తుమొర నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్ బాబు, ఒఎస్ డి శ్రీ పాల శేషాద్రి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.