BRONZE GRILLS FOR SRIVARI PUSHKARNI_ శ్రీవారి పుష్కరిణి చుట్టూ ఇత్తడి గ్రిల్స్‌ పనులు

Tirumala, 14 February 2019: The TTD program to build bronze grills around the holy Swami Pushkarani, near Srivari Temple has begun on a brisk note.

The project estimated to cost ₹4.5 crore comprises of grills all around and four gates of 6×440 feet covering the holy Pushkarani.

The TTD engineering department has commenced work on the East Mada Street and is targeted to complete works by March in time for the annual Teppotsavam of Srivari Temple.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీవారి పుష్కరిణి చుట్టూ ఇత్తడి గ్రిల్స్‌ పనులు

తిరుమల, 14 ఫిబ్రవరి 2019: తిరుమల శ్రీవారి ఆలయం వద్దగల స్వామిపుష్కరిణి చుట్టూ ఇత్తడి గ్రిల్స్‌ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. మొత్తం రూ.4.50 కోట్ల వ్యయంతో ఫిబ్రవరి 1వ తేదీన ఈ పనులు ప్రారంభమయ్యాయి.

పుష్కరిణిలో భక్తులు స్నానం చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంజినీరింగ్‌ అధికారులు తగిన జాగ్రత్తలు చేపట్టారు. ప్రస్తుతం తూర్పు మాడ వీధిలో ఈ పనులు జరుగుతున్నాయి. ఇత్తడి గేట్లను తొలగించారు. నూతన గేట్ల ఏర్పాటుకు అనుగుణంగా రాతి నిర్మాణాల తొలగింపు పనులు చేపట్టారు. మార్చిలో జరుగనున్న శ్రీవారి తెప్పోత్సవాలలోపు తూర్పు మాడ వీధిలో 440 అడుగుల మేర ఇత్తడి గేట్లను ఏర్పాటుచేస్తారు. పుష్కరిణి చుట్టూ 6 అడుగుల ఎత్తులో నాలుగు వైపులా కలిపి 1260 అడుగుల మేర ఇత్తడి గేట్లను ఏర్పాటు చేయనున్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.