PUSHPAYAGAM IN TIRUMALA ON OCT 28_ శ్రీవారి ఆలయంలో ఈ నెల 28న పుష్పయాగం

Tirumala, 23 October 2017: The annual Pushpayagam will be observed in Srivari temple on October 28.

This fete is usually observed on the advent of Sravana Nakshatra, the birth star of Lord Venkateswara.

On this auspicious occasion floral bath is rendered to the deities in sampangi mandapam with seven tonnes of different kinds of flowers.

TTD officials will take part in this fete.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

శ్రీవారి ఆలయంలో ఈ నెల 28న పుష్పయాగం

అక్టోబరు 23, తిరుమల 2017: ఈ నెల 28వ తారీఖున తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవాన్ని తి.తి.దే ఘనంగా నిర్వహించనుంది.

ఆలయ సంప్రదాయం ప్రకారం ఈ ఉత్సవాన్ని శ్రీవారి వార్షిక బ్రహ్మూెత్సవాల అనంతరం కార్తీక మాసంలో వచ్చే శ్రవణానక్షత్రం రోజున నిర్వహించడం ఆనవాయితీ.

సంపంగి ప్రాకారంలోని ప్రత్యేక మండపంలో ఉత్సవమూర్తులకు వివిధ రకాల పుష్పాలతో అభిషేక మహోత్సవాన్ని కన్నుల పండుగగా ఆచార్య పురుషులు దాదాపు 3 గంటల పాటు నిర్వహిస్తారు. కాగా ఈ పుష్పయాగం తొలిసారి 15వ శతాబ్దంలో నిర్వహించినట్లు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. ఈ ఉత్సవాన్ని తిరిగి 1980వ సంవత్సరంలో తి.తి.దే పునరుద్ధరించింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.