GANAPATHI HOMAM CONCLUDES IN KT_ శ్రీ కపిలేశ్వరాలయంలో ముగిసిన శ్రీ గణపతి హోమం

Tirupati, 23 October 2017: The three-day Ganapathi Homam concluded on Monday in the famous shrine of Sri Kapileswara Swamy temple in Tirupati.

This fete will be followed by Subrahmanyam Swamy Homam on October 24 and 25.

Temple DyEO Sri Subramanyam is supervising the Homam arrangements.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో ముగిసిన శ్రీ గణపతి హోమం

తిరుపతి, 2017 అక్టోబరు 23: తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన గణపతి హోమం సోమవారం ఘనంగా ముగిసింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు విశేషపూజ హోమ మహోత్సవాలు జరుగుతున్నాయి.

ఆలయం వెలుపల ఏర్పాటుచేసిన యాగశాలలో శ్రీ వినాయకస్వామి ప్రతిమకు విశేష అలంకరణ చేపట్టారు. ఉదయం జరిగిన కార్యక్రమంలో అర్చక బృందం పూజ, జపం, గణపతి హోమం, లఘుపూర్ణాహుతి, నివేదన నిర్వహించారు. 16 నామాలతో గణపతిని స్తుతించారు.

కాగా సాయంత్రం జపం, హోమం, శ్రీ గణపతి సహస్రనామార్చన, నివేదన, విశేష దీపారాధన, మంత్రపుష్పం మరియు హారతి ఇచ్చారు. గృహస్తులు రూ.500/- చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు హోమంలో పాల్గొన్నారు. గణపతి హోమం చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు తొలగుతాయని అర్చకులు తెలిపారు.

అక్టోబరు 24 నుంచి శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం :

శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 24, 25వ తేదీల్లో శ్రీ సుబ్రమణ్య స్వామివారి హోమం రెండు రోజుల పాటు ఘనంగా జరుగనుంది.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఏఈవో శ్రీశంకర్‌రాజు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.