R-DAY CELEBRATIONS TOUCH THE SKY_ టిటిడి పరిపాలనా భవనంలో జాతీయ జెండా రెపరెపలు

Tirupati, 26 Jan. 19: The 70th Anniversary of Republic Day witnessed a great deal of cultural programmes in the Parade Grounds of TTD administrative building on Saturday.

AVSO Sri Nandeeshwara Rao run the show as Parade Commander. 20 officers, 120 employees, 60 employees who are on the verge of their retirement were given away the meritorious certificates.

Earlier the Patriotic cultural dances performed by the students of various TTD run education institutions caught the attention of the spectators.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

టిటిడి పరిపాలనా భవనంలో జాతీయ జెండా రెపరెపలు

జనవరి 26, తిరుపతి 2019: తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో భారత గణతంత్ర వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్‌ మైదానంలో టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు.

ఈ సందర్భంగా టిటిడి భద్రతా సిబ్బంది చేసిన కవాతు ఆకట్టుకుంది. ఎవిఎస్‌వో శ్రీనందీశ్వర్‌రావు పరేడ్‌ కమాండర్‌గా వ్యవహరించారు. అనంతరం టిటిడి ఈవో ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత విధుల్లో ఉత్తమసేవలు అందించిన వివిధ విభాగాలకు చెందిన 20 మంది అధికారులు, 120 మంది ఉద్యోగులు, ఈ ఏడాది పదవి విరమణ పొందనున్న 60 మంది ఉద్యోగులకు ఐదు గ్రాముల వెండి డాలర్‌, ప్రశంసాపత్రాలు అందజేశారు.

సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థినులు ”ఓ దేశమా నీకు శతకోటి వందనా…” అనే దేశభక్తి గీతం, శ్రీ పద్మావతి మహిళ డిగ్రీ, పిజి కళాశాల విద్యార్థినులు ”తేనెల తేటల పాటలతో…” అనే దేశభక్తిగీతం ఆలపించారు. ఎస్వీ బదిర పాఠశాల విద్యార్థులు ”విశాల విశ్వంలో…” అనే గేయానికి చక్కగా నృత్యం చేశారు. ఈ కార్యక్రమానికి శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు డా|| వి.కృష్ణవేణి, ఎస్వీ ఓరియంటల్‌ కళాశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ శ్రీ పి.భాస్కర్‌ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌ జెట్టి, న్యాయాధికారి శ్రీఎం.వి.రమణ నాయుడు, అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఎఫ్‌ఏసిఏవో శ్రీ ఓ.బాలాజి, డెప్యూటీ ఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ మల్లీశ్వరి, విఎస్‌వో శ్రీమనోహర్‌, ఇతర విభాగాధిపతులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.