R-DAY CELEBRATED WITH PATRIOTIC FERVOUR BY TTD_ టిటిడి కార్యనిర్వహణాధికారి గణతంత్ర దినోత్సవ ప్రసంగం

Tirupati, 26 Jan. 19: The 70th year of Republic Day was celebrated with utmost religious fervour on Saturday in the parade grounds of TTD.

TTD EO Sri Anil Kumar Singhal who hoisted the National flag offered salutations and remembered the sacrifices of great leaders who brought independence to India and achieved Republican status to the nation on January 26 in 1950

In his speech, EO wished all the employees to dedicate themselves in pilgrim service. Some excerpts of his speech-

* TTD has successfully organized twin brahmotsavams, Vaikuntha Ekadasi last year with the team work of employees, security, srivari sevakulu and scouts.

* To spread Venkateswara Bhakti cult TTD has constructed Sri Venkateswara Swamy temple at a cost of ₹34.60 crore at Kurukshetra in Haryana which was opened on July 1 in 2018 onwards.

* Bhukarshana event for Sri Venkateswara Swamy temple which is coming up at Amaravathi, the capital city of Andhra Pradesh at a cost of ₹150 crores on January31st morning between 9.15am and 9.40 am in Meena Lagnam.

* The vigraha pratistapana of Srivari temple and Sri Maha Ganapathi temple built at a cost of₹25 crore at Banjara Hills Hyderabad is slated for opening on March 13 this year

* In Visakhapatnam the construction works of Sri Venkateswara Divya Kshetram are underway at a cost of₹7.90 crore.

* TTD has taken up the construction of Srivari temples in tribal agency belt of Seethampeta in Srikakulam District, Parvatipuram in vizianagaram District and Rampachodavaram in East Godavari District at ₹13,50 crore.

* TTD has also prepared a master plan at ₹100 crore to develop the historic and ancient Sri Kodandarama Swamy temple at Vontimetta in Kadapa District.

* Rs.26crores spent to construct toilets in Tirumala

* A 2000 room capacity accommodation is coming up at Rs.112cr near Alipiri which will be completed in four phases.

*Twin buildings for Srivari Sevakulu at Ra.98cr got ready in Tirumala

* A massive PAC at Tiruchanoor is also set ready for opening at Rs.74.70cr

* Another PAC to meet the needs of pilgrims coming to Tirumala is in offing with an estimated amount of Rs.79cr

* Rs. 1042.63cr accumulated in SV Anna prasadam Trust in the form of donations. The donations received for the financial year 2018-19 is 104cr.

* Similar to Tirumala temple, online booking of Arjitha Seva tickets was commenced in local temples of TTD which is garnering good response from devotees

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

టిటిడి కార్యనిర్వహణాధికారి గణతంత్ర దినోత్సవ ప్రసంగం

జనవరి 26, తిరుపతి 2019: భారత గణతంత్ర దినోత్సవాన్ని తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ప్రసంగించారు. వారి మాటల్లోనే…. భారతదేశ చరిత్రలో గణతంత్ర దినోత్సవం భారతీయులందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చే వరకు పరిపాలనా విధానం పూర్తిగా బ్రిటీష్‌ రాజ్యాంగం ప్రకారం జరిగేది. ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల పోరాటాల పలితంగా మన దేశాన్ని మనమే పరిపాలించుకునేందుకు వీలుగా 1950, జనవరి 26న రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. ఆ రోజు నుంచి భారతదేశం గణతంత్ర దేశం అయింది. రాజ్యాంగ నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రముఖులందరినీ ఈ సందర్భంగా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది.

తిరుమల తిరుపతి దేవస్థానముల ధర్మకర్తల మండలికి, అధికార యంత్రాంగానికి, అర్చకులకు, సిబ్బందికి, శ్రీవారి సేవకులకు, భద్రతాసిబ్బందికి, విశ్రాంత సిబ్బందికి, పాత్రికేయులకు 70వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

శ్రీవారి ఆలయం :

– తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర టిటిడి ఆలయాలలో బ్రహ్మూెత్సవాలు, వైకుంఠ ఏకాదశి లాంటి ఉత్సవాలను వైభవంగా నిర్వహించాం. ఈ ఉత్సవాలకు విచ్చేసిన లక్షలాది మంది భక్తులకు మెరుగైన సేవలు అందించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను.

– శ్రీవారి ఆలయం మరియు టిటిడి నిర్వహణలోని అన్ని ఆలయాలలో జీయంగార్లు, ఇతర ప్రముఖ ఆగమశాస్త్ర నిపుణుల సలహా మేరకు నిత్యకైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నాం.

శ్రీవారి ఆలయాల నిర్మాణం :

– తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో రూ.22.50 కోట్లతో నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రేపు ఉదయం మహాసంప్రోక్షణ నిర్వహిస్తాం.

– హర్యానా రాష్ట్రం కురుక్షేత్రలో రూ.34.60 కోట్లతో నూతనంగా నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గత ఏడాది జూలై 1వ తేదీ నుండి భక్తులకు దర్శనం కల్పిస్తున్నాం.

– అమరావతిలో రూ.150 కోట్లతో నిర్మించనున్న శ్రీవారి ఆలయానికి జనవరి 31వ తేదీన ఉదయం ఆగమోక్తంగా భూకర్షణ జరుగనుంది.

– హైదరాబాద్‌లో రూ.25 కోట్లతో నిర్మించిన శ్రీవారి ఆలయానికి మార్చి 13న విగ్రహప్రతిష్ఠ జరుగనుంది.

– విశాఖపట్నంలో రూ.7.90 కోట్లతో శ్రీవేంకటేశ్వర దివ్యక్షేత్రం పనులు జరుగుతున్నాయి.

– రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలైన శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో, విజయనగరం జిల్లా పార్వతీపురంలో, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ప్రాంతాల్లో రూ.13.50 కోట్లతో శ్రీవారి ఆలయాల నిర్మాణం చేపడుతున్నాం.

ఒంటిమిట్టలోని శ్రీకోదండరామాలయం :

– పురాతన ప్రాశస్త్యం గల ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.100 కోట్లతో మాస్టర్‌ప్లాన్‌ రూపొందించాం. ఇందులో రూ.60.65 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టాం.

ఇంజినీరింగ్‌ పనులు :

– అలిపిరి వద్ద భక్తుల సౌకర్యార్థం మొదటి దశలో రూ.112 కోట్లతో దాదాపు 500 గదులను నిర్మించేందుకు టెండర్లు ఖరారు చేశాం. నాలుగు దశల్లో 2 వేల గదులు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం.

– రూ.98 కోట్ల వ్యయంతో మహిళలకు, పురుషులకు వేరువేరుగా నిర్మించిన శ్రీవారి సేవా సదన్‌ నూతన భవనాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.

– భక్తులకు వసతిని పెంచడంలో భాగంగా రూ.79 కోట్లతో తిరుమలలోని గోవర్ధన సత్రం సమీపంలో నూతన యాత్రికుల వసతి సముదాయం నిర్మిస్తాం.

– అదేవిధంగా, తిరుచానూరులో రూ.74.70 కోట్లతో నిర్మాణంలో ఉన్న శ్రీపద్మావతి యాత్రికుల వసతి సముదాయం మార్చి నెలలో భక్తులకు అందుబాటులోకి రానుంది.

– తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో రూ.23 కోట్లతో క్యూలైన్లు, రూ.6.41 కోట్లతో మరుగుదొడ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకున్నాం.

– రూ.21.12 కోట్లతో తిరుపతిలో కల్యాణమండపాలను అభివృద్ధి చేస్తున్నాం.

– రూ.28 కోట్లతో తిరుపతిలో అలిపిరి-చెర్లోపల్లి రోడ్డు విస్తరణ పనులు చేపట్టాం.

– భక్తుల సౌకర్యార్థం రూ.119 కోట్లతో తిరుమలలో కాటేజీలు, చౌల్ట్రీలు, వసతిగదుల్లో మరమ్మతులు చేపడుతున్నాం.

– తిరుపతిని సుందరనగరంగా తీర్చిదిద్దడంలో భాగంగా అవిలాల చెరువులో శ్రీవేంకటేశ్వర ఆధ్యాత్మిక వైభవ ఉద్యానవనం (స్పిరిచువల్‌ థీమ్‌ పార్క్‌) పనులకు డిసెంబరు 6న శంకుస్థాపన జరిగింది. రూ.80.14 కోట్లతో ప్రహరీ, టికెట్‌ కౌంటర్లు, పార్కింగ్‌, సర్వీస్‌ రోడ్‌, సైకిల్‌ ట్రాక్‌, వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేస్తారు.

– తిరుపతిలో మున్సిపాలిటీ ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి అయ్యే వ్యయంలో 2/3 నిధులను టిటిడి కేటాయించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

– ఎస్‌సి, ఎస్‌టి, మత్స్యకార ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణ వ్యయాన్ని రూ.8 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచడమైనది.

భక్తుల భద్రత కోసం సిసిటివిలు :

– తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు మరింత పటిష్టంగా నిఘా, భద్రత కల్పించేందుకు ఇప్పటికే 280 సిసిటివిలు ఏర్పాటుచేశాం. మరో 1,050 సిసి కెమెరాలు ఏర్పాటుకు రూ.15.79 కోట్ల నిధులు మంజూరుచేశాం.

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు :

– శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు ఇప్పటివరకు రూ.1042.63 కోట్ల విరాళాలను భక్తులు అందించారు.

– 2018-19 సంవత్సరానికి గాను రూ.104.56 కోట్ల్ల విరాళాలు అందాయి.

– విరాళాలందించిన దాతలందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.

– శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టులో ఒక రోజు విరాళ పథకాన్ని ప్రవేశపెట్టాం.

కల్యాణమండపాల ఆన్‌లైన్‌ బుకింగ్‌ :

– చిత్తూరు జిల్లాలో 39 కల్యాణమండపాలను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే అవకాశం కల్పించాం. ఫిబ్రవరి నెల నుండి మన రాష్ట్రంలోని అన్ని టిటిడి కల్యాణమండపాలను భక్తులు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునేలా చర్యలు చేపట్టాం.

ఆన్‌లైన్‌లో టిటిడి స్థానికాలయాల ఆర్జితసేవా టికెట్లు :

– భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీనివాస మంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం, తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ శ్రీనివాస ఆలయం, శ్రీసూర్యనారాయణస్వామివారి ఆలయాల్లో ఆర్జితసేవా టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే అవకాశం కల్పించాం.

హిందూ ధర్మప్రచార పరిషత్‌ :

– హిందూ ధర్మప్రచార పరిషత్‌ ద్వారా మనగుడి, శుభప్రదం, శ్రీనివాస కల్యాణాలు, అర్చక శిక్షణ, సదాచారం, సనాతన ధార్మిక పరీక్షలు లాంటి కార్యక్రమాల ద్వారా సనాతన హైందన ధర్మ ప్రచారం చేస్తున్నాం.

– ఈ ఏడాది మార్చి చివరినాటికి 500 మంది ధర్మాచార్యులకు, అర్చకులకు శిక్షణ ఇస్తున్నాం.

పేద రోగులకు ఉచిత వైద్యం :

– శ్రీబాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీమ్‌, బర్డ్‌ ట్రస్టు ద్వారా పేదరోగులకు ఉచితంగా శస్త్రచికిత్సలతోపాటు టిటిడి ఉద్యోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నాం. మరోవైపు అరవింద నేత్ర వైద్యశాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. అదేవిధంగా, తిరుపతిలోని టాటా ట్రస్టు కేన్సర్‌ ఆసుపత్రి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ ఆసుపత్రి ద్వారా 40 శాతం మంది పేదలకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తాం.

విద్య :

– టిటిడి డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు చదువు పూర్తి కాగానే ఉపాధి పొందేందుకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థ సహకారంతో చేపడుతున్నాం.

– టిటిడి బధిర పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 900 మంది విద్యార్థులకు 4 జతల యూనిఫారంతోపాటు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నాం.

– టిటిడి విద్యాసంస్థల్లో రూ.46.50 కోట్లతో హాస్టల్‌ భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టాం.

తిరుమలలో పచ్చదనం పెంపు :

– తిరుమలలో పచ్చదనం పెంచి మరింత ఆహ్లాదంగా తీర్చిదిద్దడంలో భాగంగా రూ.3.5 కోట్లతో మాస్టర్‌ప్లాన్‌ రూపొందించాం.

– అలిపిరి నడక మార్గంలో 10 వేల మొక్కలు, శ్రీవారి మెట్టు మార్గంలో 3500 మొక్కలు పెంచాం.

– తిరుమలలో జిఎన్‌సి, వైకుంఠం క్యూకాంప్లెక్సులు, ఆకాశగంగ ప్రాంతాల్లో ఉద్యానవనాలను అభివృద్ధి చేశాం. శిలాతోరణంలో రాక్‌ గార్డెన్‌ రూపొందించాం.

తిరుమలలో ప్లాస్టిక్‌ నిషేధం :

– తిరుమలలో ప్లాస్టిక్‌ నిషేధాన్ని పాక్షికంగా అమలుచేస్తున్నాం. త్వరలో పూర్తిస్థాయిలో అమలుచేసేందుకు చర్యలు చేపట్టాం. పర్యావరణ పరిరక్షణ కోసం భక్తులు సహకరించాలని కోరుతున్నాం.

కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రోత్సాహకాలు :

– టిటిడిలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రోత్సాహకాలు (ఇన్‌సెంటివ్స్‌) అందించడం జరిగింది. ఇందులో గ్రేడ్ల వారీగా రూ.2500/- నుండి రూ. 3500/- వరకు వేతనాలు పెరిగాయి. మొత్తం 7,424 మందికి లబ్ధి చేకూరింది. ఇందుకోసం సంవత్సరానికి రూ.28.29 కోట్లు ఖర్చవుతుంది.

– టిటిడిలోని ఎస్‌సి, ఎస్‌టి, బిసి, ఆఫీస్‌ సబార్డినేట్‌, మహిళా ఉద్యోగ సంఘాల వారితో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి వారి సమస్యలను పరిష్కరిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.

– ప్రముఖ ధార్మిక క్షేత్రమైన మన తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలన ఒక సమున్నత ప్రణాళికతో ఆదర్శవంతంగా భక్తజనావళికి సేవలందిస్తున్నాం. ఈ సందర్భంగా నా సహచర ఉద్యోగులకు, శ్రీవారి సేవకులకు, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌కు అభినందనలు తెలుపుతున్నాను.

– ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు ఆ శ్రీవేంకటేశ్వరుని ఆశీస్సులు మెండుగా ఉండాలని ఈ సందర్భంగా కోరుతున్నా…జైహింద్‌…

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.