RAMAKRISHNA THEERTHA MUKKOTI REVIEW MEETING HELD _ రామకృష్ణ తీర్థ ముక్కోటి ఏర్పాట్లపై సమీక్ష

TIRUMALA, 03 FEBRUARY 2023: Under the instructions of TTD EO Sri AV Dharma Reddy the TTD vigilance and police held a review meeting in connection with Ramakrishna Theertha Mukkoti which is scheduled on February 5, Sunday in Tirumala.

 

The review meeting was held in the Common Command Control Meeting Hall on Friday.

 

In view of space constraints at Ramakrishna Theertham, it has been decided to allow only RTC buses for transporting devotees to the venue.

 

TTD vigilance officials to make traffic regulations in coordination with Tirumala Police on that day.

 

Arrangements for the distribution of food packets and water supply through pipeline to the devotees trekking Ramakrishna Theertha Mukkoti has also been discussed.

 

Additional SP Tirumala Sri Muni Ramaiah, VGOs Sri Bali Reddy, Sri Giridhar, DFO Sri Srinivas and others were present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

రామకృష్ణ తీర్థ ముక్కోటి ఏర్పాట్లపై సమీక్ష
 
తిరుమల, 03 ఫిబ్రవరి 2023: ఈఓ గారి ఆదేశాల మేరకు ఫిబ్రవరి 5న ఆదివారం జరగనున్న రామకృష్ణ తీర్థ ముక్కోటి ఏర్పాట్లపై శుక్రవారం ఉదయం పి.ఏ.సి-4 లోని మీటింగ్‌ హాల్‌లో తిరుమల వి.జీ.ఓ శ్రీ బాలిరెడ్డి, తిరుమల అడిషనల్ ఎస్పీ శ్రీ మునిరామయ్య ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

పాపవినాశనం వద్ద పార్కింగ్ సమస్య దృష్ట్యా గత సంవత్సరం తుంబురు తీర్థం సమయంలో మాదిరిగా తిరుమల నుండి మరియు గోగర్భం డ్యాం సర్కిల్ నుండి భక్తుల రాకపోకలకు ఆ ఒక్క రోజు మాత్రం ఆర్టీసీ బస్సులను మాత్రమే అనుమతించాలని నిర్ణయించడమైనది. భక్తుల రద్దీకి సరిపడా ఆర్టీసి బస్సులను ఏర్పాటు చేయుటకు తిరుమల ఆర్టీసి డిపో మేనేజర్ హామీ ఇచ్చారు. కనుక ఈ విషయంలో గతంలో మాదిరిగా ప్రైవేటు టాక్సీ డ్రైవర్లు మరియు భక్తులు తితిదేకి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేయడమైది. రామకృష్ణ తీర్థానికి వెళ్లే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సంబంధిత అధికారులు ఆహారం, తాగునీటి సౌకర్యం మరియు వైద్య సదుపాయం ఏర్పాటు చేస్తారు. కనుక భక్తులు ఈ సౌకర్యాలను ఉపయోగించుకొని తమ రామకృష్ణ తీర్థ ముక్కోటి యాత్రను ఫలప్రదం చేసుకోవాలని కోరడమైనది.

ఈ కార్యక్రమంలొ విజీఓ శ్రీ గిరిధర్, డిఎఫ్ఓ శ్రీ శ్రీనివాస్, ఆర్టీసి డిపో మేనేజర్ శ్రీ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.