IOCL MoU FOR MEDICAL EQUIPMENT TO SVIMS _ సిమ్స్ లో వైద్య పరికరాల కోసం ఐఓసిఎల్ రూ.22 కోట్లు విరాళం

IOCL DONATES 22 CRORE

MoU INKED IN TTD EO PRESENCE

Tirupati,03 February 2023: Public Sector giant, Indian Oil Corporation has come forward to donate ₹22 crores worth of medical equipment to Sri Venkateswara Institute of Medical Sciences (SVIMS ).

An MoU to that effect was signed by IOCL and SVIMS officials on Friday evening in the presence of TTD EO Sri AV Dharma Reddy.

The EO highlighted the services rendered to people and devotees at the SVIMS, BIRRD and SP Children Heart Centre hospitals run by TTD.

Speaking on the occasion the IOCL Marketing Director Sri Suresh Kumar said the contribution was made as part of its CSR activities for the needy at SVIMS.

Tirupati MP Dr M Gurumurthy, JEO for Health and Education Smt Sada Bhargavi, SVIMS Director Dr Vengamma, FA&CAO Sri O Balaji, SVIMS Medical Superintendent Dr Ram, IOCL AP& Telangana Chief Sri Anil Kumar, Rayalaseema Regional Head Sri Rohit were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సిమ్స్ లో వైద్య పరికరాల కోసం ఐఓసిఎల్ రూ.22 కోట్లు విరాళం

– ఈఓ సమక్షంలో ఎంఓయు

తిరుపతి, 03 ఫిబ్రవరి 2023: సిమ్స్ లో వైద్య పరికరాల కొనుగోలు కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ రూ.22 కోట్లు విరాళంగా అందించేందుకు ముందుకొచ్చింది. టీటీడీ పరిపాలన భవనంలోని ఈవో ఛాంబర్ లో శుక్రవారం సాయంత్రం ఈ మేరకు ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి సమక్షంలో ఐఓసీఎల్ ,స్విమ్స్ అధికారులు ఎంఓయు కుదుర్చుకున్నారు.

ఈ సందర్భంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మార్కెటింగ్ డైరెక్టర్ శ్రీ సతీష్ కుమార్ మాట్లాడుతూ, స్విమ్స్ లో రోగులకు వైద్య సహాయం అందించడానికి కార్పొరేట్ సామాజిక బాధ్యతగా ఈ నిధులను అందించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి టీటీడీ తిరుమలలో భక్తులకు, సిమ్స్, బర్డ్, చిన్న పిల్లల ఆసుపత్రుల్లో రోగులకు అందిస్తున్న సేవలను వివరించారు.

తిరుపతి ఎంపి డాక్టర్ గురుమూర్తి, జేఈవో శ్రీమతి సదా భార్గవి, సిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, ఎఫ్ఏసీఏవో శ్రీ బాలాజీ, సిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, ఐఓసీఎల్ ఎపి, తెలంగాణ ఇంచార్జ్ శ్రీ అనిల్ కుమార్, రాయలసీమ రీజనల్ హెడ్ శ్రీ రోహిత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.