RATHASAPTHAMI AT TIRUCHANOOR TEMPLE ON FEBRUARY 8 IN EKANTHAM _ ఫిబ్రవరి 8న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏకాంతంగా రథసప్తమి
Tirupati, 31 Jan. 22: TTD will be organising Ratha Sapthami in Ekantam at Sri Padmavati Ammavari temple in Tiruchanoor on February 8 and all vahana sevas would be held at Vahana mandapam.
Timings:
Surya Prabha vahana 7am – 7.30 am
Hamsa vahana 8am and 8.30 am
Ashwa Vahana 9am and 9.30 am
Garuda Vahana 9.30am and 10 am.
Chinna Sesha vahana 10am and10.30 am
Snapana Thirumanjanam 3pm and 4.30 pm
Chandra Prabha vahana 6pm and 6:30 pm
Gaja vahana 7.30pm and 8 pm.
In view of day-long festivities, TTD has cancelled all arjita sevas including Kalyanotsavan, break Darshan, Sahasra Deepalankara seva etc.
Similarly, TTD is organising Ashwa vahana and Asthanam at the Sri Suryanarayana Swamy temple near Sri Padmavati temple in the early morning hours between 6am and 7am.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
ఫిబ్రవరి 8న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏకాంతంగా రథసప్తమి
తిరుపతి, 2022 జనవరి 31: ఫిబ్రవరి 8వ తేదీన సూర్యజయంతిని పురస్కరించుకుని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి ఏకాంతంగా జరుగనుంది. ఆలయం వద్ద గల వాహనమండపంలో ఏకాంతంగా వాహనసేవలు నిర్వహిస్తారు.
సూర్యప్రభ వాహనం ఉదయం 7 గం||ల నుంచి 7.30 గం||ల వరకు
హంస వాహనం ఉదయం 8 గం||ల నుంచి 8.30 గం||ల వరకు
అశ్వ వాహనం ఉదయం 9 గం||ల నుంచి 9.30 గం||ల వరకు
గరుడ వాహనం ఉదయం 9.30 గం||ల నుంచి 10.00 గం||ల వరకు
చిన్నశేష వాహనం ఉదయం 10 గం||ల నుంచి 10.30 గం||ల వరకు
స్నపనతిరుమంజనం మధ్యాహ్నం 3 గం||ల నుంచి 4.30 గం||ల వరకు (శ్రీకృష్ణ ముఖ మండపంలో)
చంద్రప్రభ వాహనం సాయంత్రం 6.00 గం||ల నుంచి 6.30 గం||ల వరకు
గజ వాహనం రాత్రి 7.30 గం||ల నుంచి 8 గం||ల వరకు.
ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, బ్రేక్ దర్శనం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.
అదేవిధంగా, తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం పక్కన గల శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 6.00 నుండి 7.00 గంటల వరకు స్వామివారిని అశ్వవాహనంపై వేంచేపు చేసి ఆస్థానం నిర్వహిస్తారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.