FESTIVALS IN TTD LOCAL TEMPLES IN FEBRUARY _ ఫిబ్ర‌వ‌రిలో టిటిడి స్థానికాల‌యాల్లో విశేష ఉత్స‌వాలు

Tirupati, 31 Jan. 22: TTD is organising several Utsavas at its local temples of Sri Kodandarama Swamy and Sri Govindaraja Swamy during February.

 

Following are highlights of Festivals at Sri Kodandarama Swamy temple 

 

February 1: Sahasra Kalashabhisekam both morning and evening on Amavsya.

February 5,12,19,26 -All Saturdays Abhisekam for Sri Sitaram Lakshmana in mornings and Unjal Seva at evenings in Ekantam 

 

February 8: Rathan Sapthami- Surya Prabha vahana in the morning and Chandra Prabha vahana at night.

 

February 14: In honour of Punarvasu Nakshatram Sitaram kalyanam at 11.00 am and Unjal Seva at Ramachandra Pushkarini in the evening.

 

February 16: Astottara Satakalashabhisekam in the morning on Pournami day and Asthana at Ramachandra Pushkarini in the evening.

 

February 17: Kupchandrapeta Utsavam

 

Sri Govindaraja Swamy temple: 

 

February 1-24: Adhyayanotsavamse

 

February 8:  Ratha Sapthami in Ekantam 

 

February 10-16:  Teppotsavam 

 

February 17- Pranaya Kalahotsavam 

 

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఫిబ్ర‌వ‌రిలో టిటిడి స్థానికాల‌యాల్లో విశేష ఉత్స‌వాలు

తిరుప‌తి, 2022 జ‌న‌వ‌రి 31: టిటిడి స్థానికాల‌యాలైన శ్రీ కోదండ‌రామాల‌యం, శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఫిబ్ర‌వ‌రి నెల‌లో జ‌రుగ‌నున్న ఉత్స‌వాలు ఇలా ఉన్నాయి.

శ్రీ కోదండ‌రామాల‌యంలో….

– ఫిబ్ర‌వ‌రి 1న అమావాస్య సంద‌ర్భంగా ఉద‌యం 6.30 గంట‌ల‌కు స‌హ‌స్ర క‌ల‌శాభిషేకం, రాత్రి 7 గంట‌ల‌కు

– ఫిబ్ర‌వ‌రి 5, 12, 19, 26వ‌ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీసీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం, రాత్రి 7 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

– ఫిబ్ర‌వ‌రి 8న ఏకాంతంగా ర‌థ‌స‌ప్త‌మి. ఈ సంద‌ర్భంగా ఉద‌యం 7 గంట‌ల‌కు సూర్య‌ప్ర‌భ వాహ‌నం, రాత్రి 7 గంట‌ల‌కు చంద్ర‌ప్ర‌భ వాహ‌నం.

– ఫిబ్ర‌వ‌రి 14న పున‌ర్వ‌సు న‌క్ష‌త్రాన్ని పుర‌స్క‌రించుకుని ఉద‌యం 11 గంట‌ల‌కు శ్రీ సీతారాముల క‌ల్యాణం, సాయంత్రం 6.30 గంట‌ల‌కు రామ‌చంద్ర పుష్క‌రిణి వ‌ద్ద ఊంజ‌ల్ సేవ జ‌రుగ‌నున్నాయి.

– ఫిబ్ర‌వ‌రి 16న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం, సాయంత్రం 6.30 గంట‌ల‌కు రామ‌చంద్ర పుష్క‌రిణి వ‌ద్ద ఆస్థానం నిర్వహిస్తారు.

– ఫిబ్ర‌వ‌రి 17న కూపుచంద్రపేట ఉత్స‌వం.

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో…

– ఫిబ్ర‌వ‌రి 1 నుండి 24వ తేదీ వ‌రకు అధ్య‌య‌నోత్స‌వాలు.

– ఫిబ్ర‌వ‌రి 8న ఏకాంతంగా ర‌థ‌స‌ప్త‌మి.

– ఫిబ్రవరి 10 నుండి 16వ తేదీ వ‌ర‌కు శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి తెప్పోత్స‌వాలు.

– ఫిబ్రవరి 17న ప్ర‌ణ‌య క‌ల‌హ మ‌హోత్స‌వం.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.