RENDER COLLECTIVE AND PLANNED SERVICES TO PILGRIMS DURING RATHASAPTHAMI: TTD EO _ రథసప్తమికి ఉద్యోగులు సమిష్టిగా, ప్రణాళికాబద్ధంగా సేవలు అందించాలి: టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు

Tirumala, 02 February 2025: TTD EO Sri J Syamala Rao called upon the deputed employees of TTD, Vigilance and Police to provide collective and planned services to the devotees who come for Rathasaptami.  

A hand shake meeting was held on Sunday with the officials and staff of TTD along with TTD cops and police arranged to serve at Asthana Mandapam in Tirumala.  

Along with the TTD EO, Additional EO Sri Ch Venkaiah Chowdary, JEO Sri Veerabrahmam, In-charge CVSO Sri Manikantha, Tirupati SP Sri Harshavardhan Raju and other officials participated in this program. 

On this occasion, EO asked all of them to work as a team and told them to perform their respective duties collectively.  

In addition to the in-charge of each gallery, the departmental officers of all the departments have been entrusted with the responsibilities.   He said that a system has been set up to coordinate with the police and vigilance departments and every employee can provide information to the relevant departments from time to time.  The officials and staff of Annadanam, Police, Vigilance, Engineering, Medical, Health, Sanitation and other departments have been requested to provide services with joint action so that the devotees do not face any trouble anywhere. 

Similarly he asked all the departments to make best use of the services of Srivari Sevaks for providing Annaprasadam and water to the devotees waiting in the galleries.

He also asked the officers concerned that the sanitation services should be provided with high standards.  

Officers and staff working in emergency departments have been asked to work more responsible and vigilant.  

 

Employees were asked to perform their duties in their assigned areas during Chakrasnanam.

Around 200 galleries, 66 Annaprasadam distribution counters and 351 toilets have been set up in four Mada streets.  

Later, the Additional EO, said that any program will be successful only when it is discussed at the field level.

He said so far the micro and macro levels plannings have already been discussed.  If the officers and staff appointed in the galleries aquiant with each other then there will be no problems.  

He also told the mada street wise officers to brief the role clarity to the volunteers and extract better services from them.

Tirupati SP said that this year concrete plan has been prepared so that TTD employees, police and vigilance employees work in coordination.  He said that steps have been taken to provide information in a proper manner and on time. 

In-charge CVSO said that fire and medical teams are kept available in case of any emergency in Mada streets and galleries. 

TTD officials, Vigilance, Police, Srivari sevaks and others participated in this meeting. 

FA&CAO Sri Balaji, CE Sri Satyanarayana, CPRO Dr T Ravi and others were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

రథసప్తమికి ఉద్యోగులు సమిష్టిగా, ప్రణాళికాబద్ధంగా సేవలు అందించాలి: టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు

తిరుమల, 2025, ఫిబ్రవరి 02: రథసప్తమికి వచ్చే భక్తులకు ఉద్యోగులు సమిష్టిగా, ప్రణాళికాబద్ధంగా సేవలు అందించాలని టిటిడి ఈవో శ్రీ జె శ్యామల రావు కోరారు. తిరుమల ఆస్థాన మండపంలో భక్తులకు సేవలందించేందుకు ఏర్పాటు చేసిన అధికారులు, సిబ్బందిలతో ఆదివారం సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో, టిటిడి అదనపు ఈవో, టిటిడి జేఈవో, ఇంఛార్జి సివిఎస్వో, తిరుపతి ఎస్పీ తదితర అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, రథసప్తమి రోజున గ్యాలరీలలో భక్తులకు అందించే సేవలపై ముందస్తుగా క్షేత్రస్థాయిలో కార్యాచరణ సిద్ధం చేసుకుని సమిష్టిగా విధులు నిర్వర్తించాలని కోరారు. ప్రతి గ్యాలరీకి ఇంఛార్జితో పాటు , అన్ని శాఖల విభాగాల అధికారులకు బాధ్యతలను అప్పగించామన్నారు. పోలీసులు, విజిలెన్స్ శాఖలతో సమన్వయం చేసుకోవాలని, ప్రతి ఉద్యోగి కూడా సంబంధిత విభాగాలతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించేలా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్నదానం, పోలీసు, విజిలెన్స్, ఇంజనీరింగ్, వైద్య, ఆరోగ్య, శానిటేషన్ తదితర శాఖల అధికారులు, సిబ్బంది ఉమ్మడి కార్యాచరణతో సేవలు అందించాలని కోరారు.

ఉన్నత ప్రమాణాలతో శానిటేషన్ సేవలు అందించాలని సూచించారు. అత్యవసర విభాగాల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది మరింత బాధ్యతాయుతంగా, అప్రమత్తంగా పనిచేయాలని కోరారు. చేయాల్సిన, చేయకూడని పనుల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఉద్యోగులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా భక్తులకు సేవలు అందించాలన్నారు.

చక్రస్నానం రోజున ఉద్యోగులు తమకు అప్పగించిన ప్రాంతాల్లో విధులను నిర్వర్తించాలని కోరారు. నాలుగు మాడ వీధుల్లో దాదాపు 200 గ్యాలరీలు, 66 అన్నదాన కౌంటర్లు, 351 టాయిలెట్లు ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా రథసప్తమికి 3,500 మంది శ్రీవారి సేవకులు సేవలు అందిస్తారని ఈవో తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, క్షేత్ర స్థాయిలో చర్చించి సూక్ష్మ, స్థూల స్థాయిలలో సంబంధిత స్కిల్డ్, అన్ స్కిల్డ్ సిబ్బందిని నియమించకుని మరింత అప్రమత్తంగా అమలు చేసినప్పుడే ఎలాంటి కార్యక్రమాలు అయినా విజయవంతం అవుతాయన్నారు. గ్యాలరీలలో నియమితులైన అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా తాము అందిస్తున్న విధులు, బాధ్యతలను భక్తులకు తెలియజేస్తే ఎలాంటి సమస్యలు రావన్నారు. ఏదైనా సమస్యలు వస్తే తక్షణం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. గత బ్రహ్మోత్సవాల్లో, వైకుంఠ ఏకాదశి సందర్భంగా అందించిన స్ఫూర్తితోనే సేవలు అందించాలని కోరారు. రథసప్తమి సందర్భంగా వాహనానికి వాహనానికి మధ్య సమయంలో శానిటేషన్ కు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని కోరారు.

ఈ సందర్భంగా తిరుపతి ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ, టిటిడి ఉద్యోగులు, పోలీసు, విజిలెన్స్ ఉద్యోగులు సమన్వయంతో పనిచేసేలా కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. సమాచారాన్ని ఎప్పటికప్పుడు సరైన పద్దతిలో, సమయానుసారంగా అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు.

ఈ సందర్భంగా ఇంఛార్జి సివిఎస్వో శ్రీ మణికంఠ చందోలు మాట్లాడుతూ, మాడ వీధుల్లో, గ్యాలరీలలో అత్యవసర పరిస్థితి తలెత్తితే అగ్నిమాపక, మెడికల్ టీంలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.

ఈ సమావేశంలో టిటిడి అధికారులు, పోలీస్, విజిలెన్స్, శ్రీవారి సేవకులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సమావేశంలో టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, ఎఫ్ ఏ అండ్ సీఎవో శ్రీ బాలాజీ, సీఈ శ్రీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది