RENDER DEDICATED SERVICES TO PILGRIMS- TTD CHAIRMAN TO SRIVARI SEVAKS _శ్రీవారి సేవకులకు సులువుగా భగవదనుగ్రహం- టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకరరెడ్డి
Tirumala,18 September 2023: TTD Chairman Sri Bhumana Karunakara Reddy urged Srivari Sevaks to render selfless service to devotees who come to Tirumala to witness the Brahmotsavam festivities.
Addressing the Srivari Sevaks at the Asthana Mandapam on Monday morning the TTD Chairman lauded thousands of volunteers who come to serve in Tirumala and Tirupati not only during Brahmotsavam but also throughout the year with dedication and devotion from different parts of the country.
He said the voluntary service which began with just 200 volunteers in 2000, had in last 23 years recorded nearly 13 lakh volunteers and today sevaks are spread from Kashmir to Kanyakumari to offer selfless services to devotees.
He expressed happiness that around 3500 Sevakulu are serving in the present Brahmotsavam. He said he is confident that the Sevaks would go home with the blessings of Sri Venkateswara Swamy after successfully completing their service at Brahmotsavam.
Earlier TTD EO Sri AV Dharma Reddy said every tree, stone, particle and item in Tirumala are incarnation of sages and saints as mentioned by Saint poet Sri Annamacharya in his Sankeertan. He asked them to deal with pilgrims smoothly and render services.
TTD PRO Dr Ravi, Asst. PRO Kum. Neelima, Srivari Sevaks were present.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు – 2023
శ్రీవారి సేవకులకు సులువుగా భగవదనుగ్రహం
– భక్తులకు సేవాభాగ్యం ఎంతో అదృష్టం
– టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకరరెడ్డి
తిరుమల, 2023 సెప్టెంబరు 18: తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ప్రేమతో సేవలు అందిస్తున్న శ్రీవారి సేవకులకు సులువుగా భగవంతుని అనుగ్రహం లభిస్తుందని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకరరెడ్డిఉద్ఘాటించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు సేవలందించేందుకు విచ్చేసిన శ్రీవారి సేవకులకు తిరుమల ఆస్థానమండపంలో సోమవారం అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ శ్రీవారి భక్తులకు సేవలందించడం శ్రీవారి సేవకుల అదృష్టమన్నారు. భక్తులకు సేవలందించేందుకు 23 సంవత్సరాల క్రితం శ్రీవారి సేవను ప్రారంభించినట్టు చెప్పారు. ఇప్పటివరకు దేశం నలుమూలల నుండి 13 లక్షల మందికి పైగా సేవకులు పాల్గొన్నారని వెల్లడించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులకు సేవలందించేందుకు 3 వేల మంది సేవకులు వచ్చారని తెలిపారు. శ్రీవారి సేవకులు మరింత గొప్పగా సేవలందించి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.
టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి మాట్లాడుతూ శ్రీవారి సాక్షాత్కారం పొందిన శ్రీ తాళ్లపాక అన్నమయ్య తన సంకీర్తనల్లో తిరుమల కొండలను వేదాలుగా అభివర్ణించారని, సాక్షాత్తు దేవతలు, ఋషులు ఇక్కడ మృగాలుగా సంచరిస్తుంటారని తెలియజేశారని చెప్పారు. క్షణకాల దర్శనం కోసం భక్తులు సుదూర ప్రాంతాల నుండి వస్తుంటారని, అలాంటి భక్తులకు సేవలందించే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతమని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ప్రజాసంబంధాల అధికారి డా. టి.రవి, సహాయ ప్రజాసంబంధాల అధికారి కుమారి పి.నీలిమ, శ్రీవారి సేవ సిబ్బంది పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.