RENDER SERVICES TO PILGRIMS WITH PATIENCE AND DEVOTION – TTD EO_ శ్రీవారి భక్తులకు సేవ చేయడం పూర్వజన్మ సుకృతం : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirumala, 12 September 2018: We are here on this auspicious occasion of Brahmotsavams because of the past good deeds of our parents as well ours and we should make use of this God given opportunity by rendering best possible services to pilgrims with patience and affection said, EO Sri Anil Kumar Tinggal.

Addressing TTD violence and security sleuths, scouts and guides, Srivari Sevakulu in Asthana Mandapam at Tirumala on Wednesday evening, the EO said Tirumala is always abuzz with pilgrim activity 24X7 all through the year.

The expectations of pilgrims are ever increasing because of our impeccable services. So we should be polite and deal with pilgrims with more patience. You all have to render your services in your specified areas.
This year, because of twin brahmotsavams we have to be on work for 40 days.

The EO also cautioned all to be alert and give information when u come across any odd situation or suspicious activity.
You all have to cooperate with sector officers who are allotted each gallery duty in four mada streets.

Later the EO directed the vigilance and security officials to continuously monitor the video wall and CCTV.

Earlier, Tirumala JEO Sri KS Sreenivasa Raju wished all the vigilance, home guards, scouts and srivari sevakulu best of luck and asked them to render the best possible services to pilgrims during brahmotsavams with utmost discipline, devotion and dedication.

CVSO Incharge Sri Siva kumar Reddy, VGOs Sri Ravindra Reddy, Smt Sada Lakshmi, AVSOs, VIs, over 3000 Srivari Sevakulu and Scouts participated in this meeting.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి భక్తులకు సేవ చేయడం పూర్వజన్మ సుకృతం : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

ఆస్థానమండపంలో భద్రతా సిబ్బంది, శ్రీవారి సేవకులు, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ సమావేశం

తిరుమల, 2018 సెప్టెంబరు 12: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి చెంతకు విచ్చేసే భక్తులకు సేవలందించడం పూర్వజన్మ సుకృతమని టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఉద్ఘాటించారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు సేవలందించేందుకు విచ్చేసిన భద్రతా సిబ్బంది, శ్రీవారి సేవకులు, ఎన్‌సిసి క్యాడెట్స్‌, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌కు బుధవారం తిరుమలలోని ఆస్థానమండపంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టిటిడి ఈవో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల లాంటి అతిపెద్ద ఉత్సవాల్లో సేవ చేసే అవకాశం రావడాన్ని అదృష్టంగా భావించాలన్నారు. తిరుమలలో సంవత్సరం పొడవునా 24 గంటల పాటు యాత్రికుల సంచారం ఉంటుందని, టిటిడి అందిస్తున్న మెరుగైన సేవల వల్ల యాత్రికుల్లో అంచనాలు పెరుగుతున్నాయని చెప్పారు. ఈ సారి రెండు బ్రహ్మోత్సవాల సందర్భంగా దాదాపు 40 రోజుల పాటు టిటిడి అధికారులు, సిబ్బంది శ్రమించాల్సి ఉంటుందన్నారు. ఉద్యోగులతోపాటు భద్రతా సిబ్బంది, శ్రీవారి సేవకులు, ఎన్‌సిసి క్యాడెట్స్‌, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ తిరుమలకు వచ్చే భక్తులతో ఓపికగా, మర్యాదకరంగా వ్యవహరించాలని కోరారు. కేటాయించిన చోటే విధులు నిర్వహించి ఇతరులకు ఆదర్శవంతంగా నిలవాలన్నారు.

నిరంతరం అప్రమత్తంగా ఉండి అపరిచిత వ్యక్తులు, వస్తువుల గురించి భద్రతా అధికారులకు సమాచారం అందించాలని ఈవో సూచించారు. ఆలయ మాడ వీధుల్లో భక్తుల గ్యాలరీల పర్యవేక్షణ కోసం నియమించిన సెక్టార్‌ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. భద్రతా సిబ్బంది నిరంతరం వీడియోవాల్‌ ద్వారా భద్రతను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే భక్తులకు సరైన సమాచారం అందించాలన్నారు. సేవా విధుల చివరిరోజు తప్పకుండా ఫీడ్‌బ్యాక్‌ అందించాలని కోరారు.

టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు మాట్లాడుతూ భద్రతా సిబ్బంది, శ్రీవారి సేవకులు, ఎన్‌సిసి క్యాడెట్స్‌, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ క్రమశిక్షణతో, అంకితభావంతో భక్తులకు మెరుగైన సేవలందించాలని కోరారు. బ్రహ్మోత్సవాల సేవా విధులకు వచ్చినందుకు అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఇన్‌చార్జి సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, విజివోలు శ్రీ రవీంద్రారెడ్డి, శ్రీమతి సదాలక్ష్మి, ఎవిఎస్వోలు, విఐలు, 3 వేల మంది శ్రీవారి సేవకులు, వెయ్యి మంది సుశిక్షితులైన స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.