ON LINE SALE OF 2019 TTD CALENDARS AND DIARIES FROM SEPTEMBER 14_ సెప్టెంబరు 14 నుండి ఆన్‌లైన్‌లో టిటిడి క్యాలెండర్లు, డైరీలు : తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

Tirupati, 12 September 2018: The online sale of 2019 TTD calendars and diaries will be available from September 14 onwards for global devotees after they are being released by Honourable CM of AP Sri N Chandrababu Naidu, said Tirupati JEO Sri P Bhaskar.

A review meeting with IT, Sapthagiri, sales wing heads of TTD was held in the chambers of JEO in TTD administrative building in Tirupati on Wednesday.

Directing the officials, the JEO said the devotees can book the calendars and diaries through ttdsevaonline.com. The officials should coordinate with the postal department for speedy delivery.

He also instructed the Sapthagiri Chief Editor Dr Radha Ramana to maintain the postal addresses of all subscribers and ensure that the magazine reach on time.

FACAO Sri Balaji, IT chief Sri Sesha Reddy, Sales Wing DyEO Sri Hema chandra Reddy were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సెప్టెంబరు 14 నుండి ఆన్‌లైన్‌లో టిటిడి క్యాలెండర్లు, డైరీలు : తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

తిరుపతి, 2018 సెప్టెంబరు 12: టిటిడి ముద్రించిన 2019 క్యాలెండర్లు, డైరీలను సెప్టెంబరు 13వ తేదీన రాష్ట్ర ముఖ్యమంతివర్యులు గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు ఆవిష్కరిస్తారని, సెప్టెంబరు 14వ తేదీ నుండి ttdsevaonline.com వెబ్‌సైట్‌లో వీటిని భక్తులు బుక్‌ చేసుకోవచ్చని తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ వెల్లడించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల జెఈవో కార్యాలయంలో బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ డైరీలు, క్యాలెండర్లను బుక్‌ చేసుకున్న భక్తులకు ఎలాంటి జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు బట్వాడా చేయాలని, దీనిపై పోస్టల్‌ అధికారులతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. బట్వాడా సమాచారాన్ని ఎస్‌ఎంఎస్‌ ద్వారా భక్తులకు తెలియజేయాలన్నారు.

సప్తగిరి మాసపత్రికను క్రమం తప్పకుండా పాఠకులకు అందించాలి : జెఈవో

అంతకుముందు సప్తగిరి మాసపత్రికపై జరిగిన సమీక్షలో జెఈవో మాట్లాడుతూ సప్తగిరి మాసపత్రికను క్రమం తప్పకుండా పాఠకులకు అందించాలని అధికారులకు సూచించారు. స్వదేశీ, విదేశీ చందాదారుల చిరునామా వివరాలతో కంప్యూటర్‌ అప్లికేషన్‌ రూపొందించాలని, తద్వారా పత్రిక సక్రమంగా చేరేలా చూడవచ్చని చెప్పారు. చందాదారులు సూచనలు, సలహాలు, ఫిర్యాదులు చేసేందుకు, చిరునామా మార్పు వివరాలను తెలిపేందుకు ఒక ఇ-మెయిల్‌ ఐడిని రూపొందించాలని సూచించారు. చందాదారుల చిరునామా సరిగా లేనిపక్షంలో పత్రిక తిరిగి కార్యాలయానికి చేరేలా చూడాలని పోస్టల్‌ అధికారులను కోరారు.

ఈ సమావేశాల్లో టిటిడి ఎఫ్‌ఏ,సిఏవో శ్రీ ఓ.బాలాజి, ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి, చీఫ్‌ ఎడిటర్‌ డా|| రాధారమణ, సేల్స్‌ వింగ్‌ డెప్యూటీ ఈవో శ్రీహేమచంద్రారెడ్డి, ఎడిటర్‌ డా||వి.జి.చొక్కలింగం, టిసిఎస్‌ అధికారి శ్రీ సత్య, పోస్టల్‌ శాఖ అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.