RENEW SHOPS LICENSE IN TIRUMALA BEFORE JUNE 30- TTD _ జూన్ 30 లోపు లైసెన్సులు రెన్యువ‌ల్ చేసుకోవాలి : టిటిడి

Tirumala,15 June 2022: All hawkers, shop owners and tenements in Tirumala should renew their respective licences by June 30 without fail.

 

 

In a statement on Wednesday, the TTD said as per the recent TTD board decision all applications for renewal of licences in favour of Originals and transfer of licences in favour of legal heirs, and purchasers etc. should submit the required documents to TTD within 15 days of receiving the notice served by the TTD revenue department.

 

 

Applications submitted after the deadline shall be treated as illegal, licence stands cancelled and space shall be acquired by TTD.

 

 

TTD cautioned all original license holders, their descendants and those who purchased shops from original license holders to note the direction of the TTD board.

 

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్ 30 లోపు లైసెన్సులు రెన్యువ‌ల్ చేసుకోవాలి : టిటిడి

తిరుమ‌ల‌, 2022, జూన్ 15: తిరుమ‌ల‌లోని దుకాణ‌దారులు, హాక‌ర్లు, బాలాజి న‌గ‌ర్‌లోని అద్దెదారులు జూన్ 30వ తేదీలోపు లైసెన్సులు రెన్యువ‌ల్ చేసుకోవాల‌ని, అదేవిధంగా వార‌సులు/కొనుగోలుచేసిన వారు(ప‌ర్చేజ‌ర్లు) లైసెన్సులు బ‌దిలీ చేసుకోవాల‌ని టిటిడి బుధ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. దీనికి సంబంధించి ఇటీవ‌ల జ‌రిగిన బోర్డు స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకున్న విషయం తెలిసిందే.

ఈ మేర‌కు టిటిడి రెవెన్యూ విభాగం సూచించిన ప‌త్రాల‌ను జ‌త‌ప‌రిచి స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. జూన్ 30వ తేదీ త‌రువాత వ‌చ్చే విజ్ఞ‌ప్తులు స్వీక‌రించ‌బ‌డ‌వు. గ‌డువులోపు లైసెన్సులు రెన్యువ‌ల్ గానీ, బ‌దిలీ గానీ చేసుకోని ప‌క్షంలో అలాంటి దుకాణాల‌ను ఆక్ర‌మ‌ణ‌లుగా భావించి లైసెన్సులు ర‌ద్దు చేసి స్వాధీనం చేసుకోవ‌డం జ‌రుగుతుంది. ఒరిజిన‌ల్ లైసెన్సుదారులు, లైసెన్సుదారుల వార‌సులు, ఒరిజిన‌ల్ లైసెన్సులు గ‌ల దుకాణాలు కొనుగోలు చేసిన‌వారు ఈ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.