RENOVATE AND BEAUTIFY PADMAVATHI PARINAYOTSAVAM PLATFORM-TTD EO _ స‌ర్వాంగ‌సుంద‌రంగ శ్రీ ప‌ద్మావ‌తి ప‌రిణ‌యోత్స‌వ ప్రాంగ‌ణం – టిటిడి ఈవో

TIRUMALA, 08 OCTOBER 2021:  TTD EO Dr KS Jawahar Reddy inspected the Padmavathi Parinaya Mandapam located in the Narayanagiri Gardens at Tirumala on Friday along with the officials.

 

Speaking on the occasion he said, to enhance the aesthetic feel and experience of the devotees, beautification of the Narayana Gardens need to be taken up. He instructed the officials concerned to set up fountains and develop greenery. 

 

The EO also instructed to set up a musical fountain at Vaikuntham Queue Complex 2 and directed to remove the concrete debris near shelters and queue lines.

 

CVSO Sri Gopinath Jatti, CE Sri Nageswara Rao and other engineering officials were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

స‌ర్వాంగ‌సుంద‌రంగ శ్రీ ప‌ద్మావ‌తి ప‌రిణ‌యోత్స‌వ ప్రాంగ‌ణం – టిటిడి ఈవో

తిరుమల, 2021 అక్టోబ‌రు 08: తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ ప్రాంగ‌ణాన్ని స‌ర్వాంగ‌సుంద‌రంగ తీర్చిదిద్ధాల‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. శుక్ర‌వారం ఉద‌యం ఈవో, అధికారుల‌తో క‌లిసి నారాయణగిరి ఉద్యానవనాల‌ను ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్బంగా ఈవో మాట్లాడుతూ నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లో భ‌క్తుల‌కు మ‌రింత అహ్లాద‌క‌రంగా ఉండేందుకు వాట‌ర్ ఫౌంటేన్లు ఏర్పాటు చేయాల‌ని, ఖాళి ప్ర‌దేశాల్లో ప‌చ్చ‌ద‌నాన్ని పెంపొందించాల‌న్నారు. అదేవిధంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2 వ‌ద్ద మ్యూజిక‌ల్ వాట‌ర్ ఫౌంటేన్ ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. భ‌క్తుల‌కు అసౌక‌ర్యాం క‌లుగ‌కుండా క్యూలైన్లు, షెల్ట‌ర్‌ల వ‌ద్ద‌ ఉన్న‌ కాంక్రీట్ వ్య‌ర్థాల‌ను త్వ‌రితగ‌తిన తొల‌గించాల‌ని ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు.

అంత‌కుముందు నారాయణగిరి ఉద్యానవనాల్లోని క్యూలైన్లు, షెల్ట‌ర్‌ల‌ను ప‌రిశీలించి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.

టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, సిఇ శ్రీ నాగేశ్వ‌ర‌రావు ఇత‌ర ఇంజినీరింగ్ ధికారులు ఈవో వెంట ఉన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.