EO REVIEWS ARRANGEMENTS FOR CM’s VISIT TO TIRUMALA _ ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌పై ఈవో స‌మావేశం

TIRUMALA, 08 OCTOBER 2021: TTD EO Dr KS Jawahar Reddy along with District Collector Sri Hari Narayana reviewed the arrangements planned at Tirupati and Tirupati for the two-day visit of Honourable CM of AP Sri YS Jaganmohan Reddy which is scheduled on October 11 and 12.

 

The meeting was held at Annamaiah Bhavan in Tirumala on Friday afternoon. Speaking on the occasion, TTD EO directed Additional EO Sri AV Dharma Reddy and JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam to chalk out minute to minute programme of CM’s visit at BIRRD, Alipiri and Go Pradakshina Mandiram in Tirupati apart from Tirumala temple visit to avoid any sort of confusion. 

 

Later he verified the short videos designed for each and every programme CM will be inaugurating including Paediatric Cardiac Hospital in BIRRD, Alipiri Footpath, Go Pradakshina Mandiram, SVBC Kannada and Hindi channels, Dry Flower Technology artifacts, Boondi Potu and suggested to ensure that the video documentaries should be less than five minutes Ronly.

 

The CVSO Sri Gopinath Jatti and Tirupati Urban SP Sri Ch Venkatappala Naidu brifed EO on the traffic regulations and diversions at Tirupati and Tirumala while the various inauguration ceremonies are underway.

 

CE Sri Nageswara Rao, SE 2 Sri Jagadeeshwar Reddy, RDO Sri Kanakanarasa Reddy, ASP Sri Muniramaiah and other important officials from TTD, district administration and police were also present.

 

EO INSPECTS TIRUMALA

 

In the wake of scheduled Honourable CM of AP Sri YS Jaganmohan Reddy’s visit to Tirumala on October 11 and 12, TTD EO Dr KS Jawahar Reddy along with District Collector Sri Harinarayana,Urban SP Sri Ch Venkatappala Naidu and other officials from TTD and district administration inspected all the places where CM will be taking part in Garuda Seva and various other development programmes.

 

Additional EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, CE Sri Nageswara Rao were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌పై ఈవో స‌మావేశం

తిరుమల, 2021 అక్టోబ‌రు 08: శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా అక్టోబ‌రు 11, 12వ తేదీల్లో ముఖ్య‌మంత్రి శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌పై క‌లెక్ట‌ర్ శ్రీ హ‌రినారాయ‌ణ్‌తో కలిసి టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి శుక్ర‌వారం తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ ముఖ్య‌మంత్రివ‌ర్యులు అక్టోబ‌రు 11వ తేదీన మ‌ధ్యాహ్నం తిరుపతికి చేరుకుని తిరుప‌తిలోని బ‌ర్డ్ ఆసుప‌త్రిలో శ్రీ వేంక‌టేశ్వ‌ర పీడియాట్రిక్ కార్డియాక్ ఆసుప‌త్రిని ప్రారంభిస్తార‌ని, ఆ త‌రువాత వ‌రుస‌గా అలిపిరి కాలిన‌డ‌క మార్గం పైక‌ప్పు, అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద‌గ‌ల గోమందిరం ప్రారంభోత్స‌వాలు చేస్తార‌ని వెల్ల‌డించారు. అక్క‌డినుండి తిరుమ‌ల‌కు చేరుకుని సాయంత్రం శ్రీ‌వారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తార‌ని తెలిపారు. అక్టోబ‌రు 12న ఉద‌యం శ్రీ‌వారిని ద‌ర్శించుకుంటార‌ని, ఆ తరువాత ఎస్వీబీసీ క‌న్న‌డ‌, హిందీ ఛాన‌ళ్లను, నూత‌న బూందీ పోటును ప్రారంభిస్తార‌ని వివ‌రించారు.

తిరుప‌తిలో ముఖ్య‌మంత్రి పాల్గొనే ప్రారంభోత్స‌వాల ప్ర‌దేశంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసు అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని టిటిడి భ‌ద్ర‌తా విభాగం అధికారుల‌ను ఆదేశించారు. అలిపిరి పాదాల మండపం, గోమందిరం వ‌ద్ద అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, బ‌ర్డ్ ఆసుప‌త్రిలో జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మ‌య్య ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తార‌ని చెప్పారు. ఆ త‌రువాత ముఖ్య‌మంత్రి పాల్గొనే కార్య‌క్ర‌మాల‌కు సంబంధించి త‌యారుచేసిన వీడియో క్లిప్‌ల‌ను ఈవో ప‌రిశీలించి ప‌లు మార్పులు చేశారు.

శ్రీ‌వారి ఆల‌యం వ‌ద్ద ఈవో త‌నిఖీలు

అనంత‌రం ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ఆయా ప్రాంతాల‌ను శుక్రవారం ఈవో త‌నిఖీ చేశారు. శ్రీ బేడి ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం, మాడ వీధులు, గొల్ల‌మండ‌పం, బూందీ పోటు త‌దిత‌ర ప్రాంతాల‌ను ప‌రిశీలించారు. ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న సాఫీగా జ‌రిగేలా అన్ని విభాగాల అధికారులు స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని సూచించారు.

ఈవో వెంట క‌లెక్ట‌ర్ శ్రీ హ‌రినారాయ‌ణ్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, అర్బ‌న్ ఎస్‌పి శ్రీ వెంక‌ట అప్ప‌ల‌నాయుడు, అద‌న‌పు ఎస్‌పి శ్రీ మునిరామ‌య్య‌, టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎస్ఇ-2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి త‌దిత‌రులు ఉన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.