RESUMING OF ALL DARSHANS ONCE THINGS TURNS TO NORMALCY FROM COVID PANDEMIC-TTD EO _ ప్ర‌తి జిల్లాలో వేద పాఠ‌శాల ఏర్పాటు చేయాలి‌

Tirumala, 5 Mar. 21: TTD will resume all darshans in a phased manner including Arjitha Sevas, Senior Citizens, Specially abled etc. which were stalled during March last, owing to COVID pandemic said TTD EO Dr KS Jawahar Reddy.

The EO attended to 32 pilgrim callers from across the country during the monthly Dial your EO programme held at Annamaiah Bhavan at Tirumala on Friday. Some excerpts from the live phone in programme.

Callers Sri Ranga Rao and Sri Radhakrishna from Vijayawada, Sri Praveen from Anantapur when asked EO on resuming senior citizens and physically handicapped darshans for pilgrims, the EO said it depends upon the COVID Pandemic situation.

Answering a caller Sri Rangacharya from Warangal the EO said, as part of its Sanatana Dharma Prachara TTD is rigorously working to bring out Astadasa Puranas to the pubic fore and veteran pundits are working on the project. We have already released Matsya Puranam, Brahma Maha Puranam, Vishnu Puranam etc.recently and will release others also. He also said, as sought by the caller, he will verify about Sri Bhashyam penned by Sri Ramanujacharya and see the possibility for its publication.

Praveen, another caller from Chittoor sought EO to resume services for Scouts and Guides to which EO said they will enrolled for service once the pilgrim rush turns to normalcy in Tirumala.

While Sri Reddisekhar from Punganur brought to the notice of EO about the issues related to TTD Call Centre to which EO said they will be sorted out soon. 

Sri Srinivas from Jaggaiahpeta sought EO to play Om Namo Narayanaya chants in Alipiri footwalkers path to which EO said, once the Alipiri footpath works completed, TTD will resume the Astakshari Nama audio in the footpath route.

Another pilgrim Sri Gnanaprakash from Tirupati suggested EO on saving waiting time by a pilgrim who wish to offer hairs at Kalyanakatta to which EO readily agreed upon avoiding inconvenience to pilgrims.

Smt Syamala from Hyderabad poured on laurels on TTD and said the SVBC Channel on her Television commences at 6am and will last the whole day and complimented the Maghapurana Pravachanam, Sundarakanda, Nrisimha Puranam, Bhagavat Geeta, Virataparvam etc. and thanked TTD for bringing out the hidden talents and educating the devotees on the richness of Hindu Dharma embedded in these epics.

Sri Appanna from Visakhapatnam sought EO to set up SV Veda Pathashalas in every district Head Quarter as a measure to promote Vedic education.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ప్ర‌తి జిల్లాలో వేద పాఠ‌శాల ఏర్పాటు చేయాలి‌

తిరుమల, 2021 మార్చి 05: తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శుక్ర‌వారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి సమాధానాలు ఇచ్చారు.

1. అప్ప‌న్న – వైజాగ్‌

ప్రశ్న: ప్ర‌తి జిల్లాలో వేద పాఠశాల ఏర్పాటు చేయాలి. శ్రీ‌వారి ఆర్జిత సేవ‌లు ల‌క్కీడిప్ విధానంలో కాకుండా ఇ- ద‌ర్శ‌న్ కౌంట‌ర్ల‌లో బుక్ చేసుకునే అవ‌కాశం ఇవ్వాలి.

ఈవో : ప‌రిశీ‌లించి త‌గిన నిర్ణ‌యం తీసుకుంటాం.

2. కిర‌ణ్ – నెల్లూరు‌

ప్రశ్న: శ్రీ‌వారి క‌ల్యాణోత్స‌వం టికెట్టు బుక్ చేసుకునేట‌ప్పుడు ల‌డ్డూ, వ‌డ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే అవ‌కాశం ఇవ్వాలి

ఈవో : భ‌విష్య‌త్తులో స‌మ‌స్య రాకుండా ఏర్పాటు చేస్తాం.

3. ప్ర‌వీణ్‌ – చిత్తూరు

ప్రశ్న: స్కౌంట్స్ అండ్ గైడ్స్ సేవ‌లు తిరిగి ప్రారంభించండి

ఈవో : పూర్తి స్థాయిలో యాత్రికులు వ‌చ్చాక అవ‌స‌రాన్ని బ‌ట్టి వీరి సేవ‌లు వినియోగించుకుంటాం.

4. ప్ర‌వీణ్‌ – అనంత‌పురం,

ప్రశ్న: టిటిడి భ‌క్తుల‌కు అందిస్తున్న సేవ‌లు బాగున్నాయి. రూ.300- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్లు పొందిన సీనియ‌ర్ సిటిజ‌న్స్‌ను ప్ర‌త్యేక క్యూలో వ‌ద‌లాలి.

ఈవో : త్వ‌ర‌లో ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తాం.

5. రామ‌కృష్ణ శాస్త్రి – తిరువ‌ ణామ‌లై

ప్రశ్న: టిటిడిలోని వివిధ‌ ట్ర‌స్టుల‌కు డొనేష‌న్ ఇచ్చాను. దాత‌లు ఎవ‌రి పేర్లు ఇచ్చినా ద‌ర్శ‌నం, వ‌స‌తి క‌ల్పించాల‌ని కోరుతున్నాను.

ఈవో : ప‌రిశీలించి త‌గిన నిర్ణ‌యం తీసుకుంటాం.

6. రాధాకృష్ణ – విజ‌య‌వాడ‌‌

ప్రశ్న: గ‌దుల కోసం క్యూలో ఉన్న విక‌‌లాంగుల‌ను పోలీసులు తోసేస్తున్నారు.

ఈవో : ప్ర‌త్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసి ఇబ్బంది తొల‌గించే ప్ర‌య‌త్నం చేస్తాం.

7. డాక్ట‌ర్ సుధాక‌ర్‌ – కామారెడ్డి‌

ప్రశ్న: తిరుమ‌ల‌లో క‌ల్యాణోత్స‌వం ఎప్ప‌టి నుండి ప్రారంభిస్తారు.

ఈవో : కోవిడ్ కేసులు పెర‌గ‌క పోతే ఏప్రిల్ 14వ తేదీ నుండి ప్రారంభించాల‌ని అనుకుంటున్నాము.

8. రెడ్డి శేఖ‌ర్ – పుంగ‌నూరు‌

ప్రశ్న: టిటిడి కాల్ సెంట‌ర్‌లో ఫోన్ క‌ల‌వ‌డం లేదు. గ‌త 3 నెల‌ల నుండి ప్ర‌య‌త్నిస్తున్నాను.

ఈవో : ప్ర‌తి రోజు 2400 కాల్స్ వ‌స్తున్నాయి. భ‌విష్య‌త్తులో స‌మ‌స్య రాకుండా ఏర్పాట్లు చేస్తాం

9. వీర‌వ‌ర్థ‌న్ రెడ్డి – రాయ‌చూర్‌

ప్రశ్న: ఆల‌యంలో స్వామివారిని చూసే స‌మ‌యంలో తోసేస్తున్నారు?

ఈవో : అలా జ‌రుగ‌కుండా చూస్తాం.

10. రంగాచారి – వ‌రంగ‌ల్‌

ప్రశ్న: భ‌గ‌వ‌త్ రామానుజులు ర‌చించిన శ్రీ భాష్యం గ్రంథాలు, అష్టాద‌శ పురాణాలు దొర‌కడం లేదు ?

ఈవో : భ‌గ‌వ‌త్ రామానుజులు ర‌చించిన శ్రీభాష్యం గ్రంథాల ముద్ర‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకుంటాం. అష్టాద‌శ పురాణాల‌లో మూడు గ్రంథాలు ఇటీవ‌ల విడుద‌ల చేశాం.

11. సాయిచంద్ – అమ‌లాపురం

ప్రశ్న: విఐపిల‌కే కాకుండా సామాన్యుల‌కు కూడా ఎల్‌1, ఎల్2 టికెట్లు ఇవ్వాలి ?

ఈవో : ఎల్‌1, ఎల్2 లేవు. బ్రేక్ ద‌ర్శ‌నం మాత్ర‌మే ఉంది. శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా 10 వేలు చెల్లించి విఐపి ద‌ర్శ‌నం టికెట్లు పొంద‌వ‌చ్చు.

12. లక్ష్మి – చింతామ‌ణి‌

ప్రశ్న: మ‌హ‌ద్వారం వ‌ద్ద నీరు వ‌ద‌ల‌డం లేదు. నీరు వ‌దిలితే కాళ్ళు క‌డుక్కుని గుడిలోకి వెళ‌‌తాం.

ఈవో : కోవిడ్ కార‌ణంగా నిలిపివేశాం. త్వ‌ర‌లో పున‌రుద్ధ‌రిస్తాం

13. శ్రీ‌నివాస్ – జ‌గ్గ‌య్య‌పేట‌

ప్ర‌శ్న : అలిపిరి న‌డ‌క మార్గంలో వ‌చ్చే భ‌క్తుల కొర‌కు శ్రీ‌వారి అష్టాక్ష‌రి మంత్రం వినిపించే ఏర్పాటు చేయాలి.

ఈవో : న‌డ‌క‌దారి పైక‌ప్పు నిర్మాణం ‌పూర్తి కాగానే శ్రీ‌వారి అష్టాక్ష‌రి మంత్ర ప్ర‌సారాన్ని పున‌రుద్ధ‌రిస్తాం.

14. సుజాత – చెన్నై

ప్ర‌శ్న: స‌ప్త‌గిరి మాస ప‌త్రిక స‌రిగా రావడం లేదు. సుంద‌ర‌కాండ, విరాట‌ప‌ర్వం, భ‌గ‌వ‌ద్గీత శ్లోకాలు ముద్రించాలి.

ఈవో : స‌ప్త‌గిరి మాస ప‌త్రిక బ‌ట్వాడాపై అధికారుల‌తో చ‌ర్చించి చ‌ర్య‌లు తీసుకుంటాం. సుంద‌ర‌కాండ, విరాట‌ప‌ర్వం, భ‌గ‌వ‌ద్గీత శ్లోకాలు వ్యాఖ్యానంతో స‌హ ముద్రించే ఏర్పాటు చేస్తాం.

15. స‌త్య‌నారాయ‌ణ – చొప్ప‌ల్‌

ప్ర‌శ్న: గ‌తంలో ఆన్‌లైన్‌లో సేవ‌లు, గ‌దులు, టికెట్లు బుక్ చేసుకోవ‌డానికి 90 రోజుల స‌మ‌యం ఇచ్చేవారు. ఇప్పుడు 30 రోజులు ఇస్తున్నారు.

ఈవో : కోవిడ్ పూర్తిగా తగ్గాక 90 రోజుల స‌దుపాయాన్ని పున‌రుద్ధ‌రిస్తాం.

16. రంగారావు – విజ‌య‌వాడ‌

ప్ర‌శ్న : శ్రీ‌వాణి ద్వారా టికెట్టు కొన్న వృద్ధుల‌ను ప్ర‌త్యేక లైన్ ద్వారా ద‌ర్శ‌నానికి అనుమ‌తించాలి. వృద్ధుల‌ను స్వామివారి ద‌ర్శ‌నానికి ప్ర‌త్యేక క్యూ లైన్ ద్వారా ఎప్పుడు అనుమ‌తిస్తారు.

ఈవో : శ్రీ‌వాణి ద్వారా టికెట్టు కొన్న వృద్ధులు న‌డ‌వ‌లేని ప‌రిస్థితిలో ఉంటే బ‌యోమెట్రిక్ ద్వారా ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తాం. ఏప్రిల్ 14వ తేదీ త‌రువాత ప‌రిస్థితులు అనుకూలిస్తే వృద్ధుల‌ను ప్ర‌త్యేక క్యూ లైన్ ద్వారా స్వామివారి ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తాం.

17. వెంక‌టేష్ – హైద‌రాబాద్‌

ప్ర‌శ్న : ఇ- హుండి ద్వారా స్వామివారికి విరాళాలు పంపితే స‌ర్వీస్ చార్జ్ క‌ట్ చేస్తున్నారు.

ఈవో : ఐటి, ఆర్థిక విభాగం అధికారుల‌తో మాట్లాడి త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటాం.

18. వెంక‌ట్రామిరెడ్డి – రాయ‌చూర్ / అశోక్ కుమార్ – హిందూపురం‌

ప్ర‌శ్న : ఆన్‌లైన్‌లో గ‌దుల రిజ‌ర్వేష‌న్ కోటా పెంచాలి.

ఈవో : ప్రస్తుతం రెండు వేల గ‌దులు ఆన్‌లైన్‌లో అడ్వాన్స్ రిజ‌ర్వేష‌న్‌లో ఇస్తున్నాం. కోటా పెంచే అవ‌కాశాన్ని ప‌రిశీలిస్తాం.‌

19. శ్రీ‌ను – మంగ‌ళ‌పాల్యం‌

ప్ర‌శ్న: ఉచిత ద‌ర్శ‌నం టికెట్ల కోటా పెంచాలి. శ్రీ‌వాణి టికెట్ ద్వారా ఇద్ద‌రిని శ్రీవారి ద‌ర్శ‌నానికి అనుమ‌తించాలి.

ఈవో : ప్ర‌స్తుతం రోజుకు 22 వేల ఉచిత ద‌ర్శ‌నం టికెట్లు ఇస్తున్నాం. కోవిడ్ పూర్తిగా త‌గ్గి పోయాక ఈ సంఖ్య పెంచుతాం. శ్రీ‌వాణి టికెట్ ద్వారా ఇద్ద‌రిని ద‌ర్శ‌నానికి అనుమ‌తించే అంశం వీలైతే ప‌రిశీలిస్తాం.

20. సుంద‌రి – ఈరోడ్‌‌

ప్ర‌శ్న : ప్రాణ‌దానం స్కీమ్‌కు విరాళం పంపాం. జులై, ఆగ‌స్టులో అష్ట‌ద‌ళ‌పాద‌ప‌ద్మారాధ‌న సేవ లేదా ఎల్‌1, ఎల్‌2 టికెట్టు ఇస్తారా.

ఈవో : ప్ర‌స్తుతం ఎల్‌1, ఎల్2లు లేవు. ‌

21. గిరిజ‌ – క‌ర్నాట‌క‌

ప్ర‌శ్న : ఆన్‌లైన్‌లో స‌ర్వ‌ద‌ర్శ‌నం టికెట్లు ఇవ్వాలి.

ఈవో : ఆ స‌దుపాయం లేదు.

22. శ్యామ‌ల – హైద‌రాబాద్‌‌

ప్ర‌శ్న : ఎస్వీబీసీ ప్ర‌సారం చేస్తున్న కార్య‌క్ర‌మాలు అద్భుతంగా ఉన్నాయి. వేదాలు, పురాణాల గురించి స‌వివ‌రంగా ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేస్తున్నారు. భ‌గ‌వ‌ద్గీత పారాయ‌ణం అమోఘం. సుంద‌ర‌కాండ, విరాట‌ప‌ర్వం ముద్రించి భ‌క్తుల‌కు అందుబాటులోనికి తేవాలి.

ఈవో : అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి ఆధ్వ‌ర్యంలో ఎస్వీబీసీ కార్య‌క్ర‌మాలు అద్భుతంగా రూపొందిస్తున్నారు. ప్ర‌తి కార్య‌క్ర‌మానికి ప్ర‌జ‌ల నుండి విశేష స్పంద‌న ల‌భిస్తోంది. టిటిడిలో ఎంతో మంది ప్ర‌తిభావంతులు ఉన్నారు. పురాణాలు, వేదాలు సామాన్యుల‌కు ద‌గ్గ‌ర చేయాల‌నే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. సుంద‌ర‌కాండ, విరాట‌ప‌ర్వం ముద్రించి భ‌క్తుల‌కు అందుబాటులోనికి తెస్తాం.

23. భాస్క‌ర్ – హైద‌రాబాద్‌

ప్ర‌శ్న : రూ.10 ల‌క్ష‌లు విరాళం ఇచ్చే దాత‌ల‌కు ఆరు మందిని ద‌ర్శ‌నానికి అనుమ‌తించే ఏర్పాటు చేయాలి. దాత‌ల‌కు రాంభ‌గీచాలో కాకుండా వృద్ధుల‌కు అనుకూలమైన చోట వ‌స‌తి ఇవ్వాలి.‌

ఈవో : ఐదు మందిని ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తున్నాం. ఒక‌రిద్ద‌రు ఎక్కువ వ‌స్తే టికెట్టు కొని ద‌ర్శ‌నానికి వెళ్ళొచ్చు. తిరుమ‌ల‌లోని వ‌స‌తి గృహాలు, అతిథి గృహాలు మ‌ర‌మ‌త్తులు జ‌రుగుతున్నాయి, ఆరు నెల‌ల్లో
వీటిని అందుబాటులోనికి తెస్తాం.

24. ర‌ఘురామాచార్యులు – వైజాగ్‌‌‌

ప్ర‌శ్న : నాద‌నీరాజ‌నం వేదిక‌పై సీనియ‌ర్ సిటిజ‌న్స్‌కు కూడా కార్య‌క్ర‌మాలు ఇవ్వ‌డానికి అవ‌కాశం ఇవ్వాలి.తిరుమ‌ల‌కు ఒక‌రే వ‌స్తే గ‌ది ఇవ్వ‌డం లేదు.

ఈవో : తిరుమ‌ల‌కు ఒక‌రే వ‌స్తే పిఏసిలో వ‌స‌తి ఇస్తున్నాం. నాద‌నీరాజ‌నం వేదిక‌పై సీనియ‌ర్ సిటిజ‌న్స్‌కు కార్య‌క్ర‌మాలు ఇచ్చే అవ‌కాశాలు ప‌రిశీలిస్తాం.

25. శ్రీ‌నివాస్ – హైద‌రాబాద్‌‌‌‌

ప్ర‌శ్న : ఎస్వీబీసీ లైవ్ కార్య‌క్ర‌మాల ఆడియో స‌‌రిగా రావడం లేదు.

ఈవో : ఎస్వీబీసీకి కొత్త ప‌రిక‌రాలు కొని ప్ర‌సారాల్లో నాణ్య‌త పెంచే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. త్వ‌ర‌లో ఈ స‌మ‌స్య తీరుతుంది.

26. వెంక‌టేశ్వ‌ర‌రావు- సంగారెడ్డి‌‌‌

ప్ర‌శ్న : ఆన్‌లైన్‌లో క‌ల్యాణం టికెట్టు తీసుకున్న భ‌క్తుల‌కు గ‌తంలో లాగ ల‌డ్డూ, వ‌డ ప్ర‌సాదాలు ఇవ్వాలి.

ఈవో : ఆన్‌లైన్‌లో క‌ల్యాణం టికెట్టు తీసుకున్న భ‌క్తుల‌కు ఒక ల‌డ్డూ మాత్ర‌మే ఇచ్చేలా విధానం మార్చాం. ఇది గ‌మ‌నించాలి.

27. శ్రీ‌నివాస్ – వైజాగ్‌

ప్ర‌శ్న : ఆర్మీ వారిని ఉచితంగా స్వామివారి ద‌ర్శ‌నానికి పంపేవారు. ఇప్పుడు దీనిని ఆపేశారు.

ఈవో : ఇప్పుడు ఆర్మీ గుర్తింపు కార్డు చూపిస్తే రూ.300- టికెట్టు ఇస్తున్నాం.

28. జ్ఞాన ప్ర‌కాష్ – తిరుప‌తి‌‌

ప్ర‌శ్న : క‌ల్యాణ క‌ట్ట‌లో త‌ల త‌డుపుకున్నాకే క్షుర‌కుల ద‌గ్గ‌రికి పంపే ఏర్పాటు చేస్తే భ‌క్తుల‌కు ఇబ్బంది లేకుండా చేయ‌వ‌చ్చు.

ఈవో : ఈ విధానం అమ‌లు చేయడానికి చర్యలు తీసుకుంటాం.

29. వెంక‌టేశ్వ‌ర్లు – ఖ‌మ్మం‌‌‌

ప్ర‌శ్న : తిరుమ‌ల‌లో అఖండ హ‌రినామ సంకీర్త‌న చేయాలి.

ఈవో: ప‌రిశీలిస్తాం.

30. సుబ్బారావు -చెన్నై

ప్ర‌శ్న : రూ.5 ల‌క్ష‌లు విరాళం ఇచ్చాను. రెండు సంవ‌త్స‌రాలుగా అడుగుతున్నా డోనేషన్ స్లిప్ ఇవ్వ‌డం లేదు.‌

ఈవో : మీ వివ‌రాలు తీసుకుని స‌మ‌స్య వెంట‌నే ప‌రిష్క‌రిస్తాం.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ ర‌మేష్‌రెడ్డి, ఎస్వీబీసీ సీఈవో శ్రీ సురేష్‌కుమార్‌, ఎస్ఇ-2 శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఆరోగ్యాధికారి డాక్ట‌ర్ ఆర్ఆర్‌.రెడ్డి త‌‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.