RETIREMENT FOR ARCHAKAS WHO HAVE CROSSED 65YEARS – TTD TRUST BOARD CHIEF _ టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు

Tirumala, 16 May 2018: The retirement for Archakas after 65years of age will come into fore, said TTD Trust Board Chairman Sri Putta Sudhakar Yadav.

The maiden Trust Board Meeting was held at Annamaiah Bhavan in Tirumala on Wednesday. After the board deliberations, speaking to media persons, the TTD board chief briefed on some of the decisions taken during the meeting. He said, from the past one year, many decisions have been pending which were approved today by the board. He said, the next board meeting will be held on June 5.

Approvals by TTD Trust Board:

·Local Advisory Committee constituted for Sri Venkateswara Swamy temple in New Delhi.

·For TTD investing deposits in banks, a sub-committee has been constituted.

·On the advent of Punarvasu Star every month, Arjitha Kalyanotsavam will be performed Chandragiri Kodanda Ramalayam temples which was introduced in the month of January this year and it is approved by the board.

EO REACTS

When some media persons sought EO to respond to the allegations made by Dr AV Ramana Dikshitulu, one of the Chief Priests of Tirumala temple, TTD EO Sri Anil Kumar Singhal said, as per the decision by TTD board, notice will be sent to him seeking his explanation for allegedly making some derogatory remarks on TTD.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు

మే 16, తిరుమల 2018 ; టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం బుధవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌యాదవ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు ఇలా ఉన్నాయి.

-టిటిడిలో విధులు నిర్వహిస్తున్న 65 సంవత్సరాలు పైబడిన అర్చకులకు ఉద్యోగ విరమణ వర్తింపు.

-ఢిల్లీలోని శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయానికి సలహా మండలి ఏర్పాటు.

-శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ పరిధిలో ఉన్న చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో పునర్వసు నక్షత్రం సందర్భంగా ప్రతినెలా ఆర్జిత కల్యాణోత్సవం నిర్వహణ.

-టిటిడి పలు బ్యాంకుల్లో చేస్తున్న డిపాజిట్లకు సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు సబ్‌ కమిటీ ఏర్పాటు.

-ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు… శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీ రమణదీక్షితులు చేసిన ఆరోపణలపై వివరణ కోరుతాం.

-జూన్‌ 5న టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం జరుగనుంది.

ఈ సమావేశంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, జెఈవోలు శ్రీకె.ఎస్‌.శ్రీనివాస రాజు, శ్రీ పోల భాస్కర్‌, శ్రీ జిఎస్‌ఎస్‌.శివాజి, శ్రీ బోండా ఉమామహేశ్వర్‌రావు, శ్రీ బికె.పార్థసారధి, శ్రీ రాయపాటి సాంబశివరావు, శ్రీ చల్లా రామచంద్రారెడ్డి, శ్రీ పొట్లూరి రమేష్‌బాబు, శ్రీ ఇ.పెద్దిరెడ్డి, శ్రీ సండ్ర వెంకటవీరయ్య, శ్రీమతి సుధా నారాయణమూర్తి, శ్రీమతి సప్న, శ్రీ రుద్రరాజు పద్మరాజు, శ్రీ మేడా రామకృష్ణారెడ్డి, శ్రీ డొక్కా జగన్నాథం, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ శ్రీమతి వైవి.అనూరాధ, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ అశోక్‌రెడ్డి, శ్రీ శ్రీకృష్ణ పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.