REVIEW MEETING HELD _ తుంబూరు తీర్థముక్కోటిపై సమీక్ష

TIRUMALA, 04 APRIL 2023: A review meeting on the arrangements for Tumburu Theertha Mukkoti was held in Tirumala on Tuesday.

 

Upon the instructions of TTD EO Sri AV Dharma Reddy, TTD vigilance and Tirumala police hg held a detailed review meeting at the Command Control room in PAC 4.

 

ASP Sri Muniramaiah, VGO Sri Bali Reddy and other vigilance and police officials were present.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తుంబూరు తీర్థముక్కోటిపై సమీక్ష

తిరుమల, 2023 ఏప్రిల్ 04: టీటీడీ ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి ఆదేశాల మేరకు పీఏసీ 4లోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో తుంబూరు తీర్థ ముక్కోటి ఏర్పాట్లపై మంగళవారం టీటీడీ విజిలెన్స్, తిరుమల పోలీసులు సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు:

– తుంబురు తీర్థానికి ఏప్రిల్ 5న ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, 6వ తేదీన ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు.

– తీర్థానికి ఎక్కువ దూరం నడవాల్సింది వస్తుంది కావున గుండె సమస్యలు, స్థూలకాయం ఉన్నవారిని అనుమతించరు.

– భ‌క్తులు వంట సామగ్రి, క‌ర్పూరం, అగ్గిపెట్టెలు తీసుకురాకూడదు.

– పాప వినాశనం వద్ద పార్కింగ్ సౌకర్యం లేదు, కావున ప్రైవేట్ ట్యాక్సీలు, వాహనాలను అనుమతించారు. ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే భక్తులను అనుమతిస్తారు.

– పోలీసుశాఖ, అటవీశాఖ, టిటిడి విజిలెన్స్ విభాగం సమన్వయంతో పాపవినాశనం నుండి తుంబురు తీర్థం వరకు అక్కడక్కడ భద్రతా సిబ్బందిని వుంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

ఈ సమావేశంలో ఏఎస్పీ శ్రీ మునిరామయ్య, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇతర విజిలెన్స్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.