SGS ARTS COLLEGE BAGS NAAC A+ GRADE _ ఎస్‌జిఎస్ ఆర్ట్స్ కళాశాలకు న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ – అభినందించిన ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి
Tirupati, 04 April 2023: TTD’s Sri Govindaraja Swamy Arts College received a prestigious NAAC A+ grade in its first attempt itself.
TTD EO Sri AV Dharma Reddy lauded the college Principal Sri Venugopal Reddy and given NAAC A+ certificate on Tuesday.
The college got the recognition for maintenance of it’s environs, imparting qualitative education to the students’, eco-friendly precincts, library and administration.
TTD EO appreciated the efforts of JEO for Health and Education Smt Sada Bhargavi and her team comprising, DEO Sri Bhaskar Reddy, Deputy EO Sri Govindarajan and college Principals for getting NAAC A+ to all the TTD colleges in a year.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఎస్‌జిఎస్ ఆర్ట్స్ కళాశాలకు న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్
– అభినందించిన ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి
తిరుపతి, 2023 ఏప్రిల్ 04: ఎస్‌జిఎస్ ఆర్ట్స్ కళాశాలకు తొలి ప్రయత్నం లోనే న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ గుర్తింపు లభించింది. టీటీడీ పరిపాలన భవనంలో మంగళవారం ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి చేతుల మీదుగా కళాశాల ప్రిన్సిపల్ శ్రీ వేణుగోపాల్ రెడ్డి ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్ అందుకున్నారు.
ఎస్‌జిఎస్ కళాశాలలో ఉత్తమ విద్యాబోధన, కళాశాల నిర్వహణ, గ్రంధాలయం, వసతి గృహాలు , కళాశాల ఆవరణంలో పచ్చదనం పెంపొందించి పర్యావరణ పరిరక్షణ, ఇతర అన్ని అంశాల్లో ఉత్తమ విధానాలు అమలు చేస్తున్నందుకు న్యాక్ సంస్థ ఈ సర్టిఫికెట్ అందించింది.
ఏడాది కాలం లోనే టీటీడీలోని అన్ని కళాశాలలకు న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ రావడానికి కృషి చేసిన జేఈవో శ్రీమతి సదా భార్గవి, డిఈవో శ్రీ భాస్కర్ రెడ్డి, డిప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, కళాశాలల ప్రిన్సిపాళ్ళు, సిబ్బందిని ఈవో అభినందించారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది