REVIEW MEETING ON ANNUAL BRAHMOTSAVAMS HELD _ అక్టోబరు 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

ANNUAL FEST FROM OCTOBER 4-12

GEAR UP FOR THE BIG FETE-ADDITIONAL EO

ALL PRIVILEGE DARSHANS AND ARJITA SEVAS STANDS CANCELLED 

Tirumala, 03 August 2024: As the annual brahmotsavams at Tirumala is exactly two months to go, TTD Additional EO Sri Ch Venkaiah Chowdhary has directed all the officials to gear up for the mega religious festival.

A detailed first review meeting on Salakatla Brahmotsavams with the officers concerned was held at Annamaiah Bhavan in Tirumala on the Engineering works, checking the fitness of vahanams, laddu stock, Annaprasadam, Darshan and Accommodation, Security arrangements of TTD Vigilance and Security wing in co-ordination with Police, Kalyanakatta, Transport, HDPP, Garden, Medical, Health, Paraphernalia, Srivari Sevaks etc. were discussed.

The important days in Annual Brahmotsavam includes Dhwajarohanam on October 4, Garuda Seva on October 8, Golden Chariot on October 9, Rathotsavam on 11, Chakrasnanam on October 12. The morning vahanams will commence at 8am and evening vahanams by 7pm.

As heavy pilgrim rush is being anticipated for Garuda Seva, ban on the plying of two-wheelers will come into force from 11pm of October 7 till the midnight of October 8.

TTD has cancelled all Arjita Sevas and privilege darshans including senior citizens-diabled, NRIs, parents with infants stands cancelled during that period.

CEO SVBC Sri Shanmukh Kumar, CE Sri Nageswara Rao and other heads of various departments were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అక్టోబరు 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

– భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలవకుండా విస్తృత ఏర్పాట్లు

•⁠ ⁠అన్ని ప్రత్యేక దర్శనాలు మరియు అర్జిత సేవాలు రద్దు

•⁠ ⁠టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి

తిరుమల, 2024 ఆగష్టు 03: తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రెండు నెలల సమయం ఉన్నందున, అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని టిటిడి అదనపు సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు.

తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో శనివారం సాయంత్రం శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై జరిగిన తొలి సమావేశంలో టీటీడీ అదనపు ఈవో ఇంజినీరింగ్‌ పనులు, వాహనాల ఫిట్‌నెస్‌, లడ్డూ బఫర్ స్టాక్‌, అన్నప్రసాదం, దర్శనం, వసతి, కళాబృందాల కార్యక్రమాలు, ఉద్యానవన శాఖ, ట్రాన్స్పోర్ట్, కళ్యాణ కట్ట, గోశాల,శ్రీవారి సేవకులు, టీటీడీ విజిలెన్స్‌ విభాగం భద్రతా ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

కాగా ఈ ఏడాది వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రముఖంగా అక్టోబర్ 4న ధ్వజారోహణం, అక్టోబర్ 8న గరుడసేవ, అక్టోబర్ 9న స్వర్ణరథం, 11న రథోత్సవం, అక్టోబర్ 12న చక్రస్నానం నిర్వహిస్తారు. వాహన సేవలు ప్రతి రోజు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతాయి.

సాధారణంగా గరుడ సేవ రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే కారణంగా , అక్టోబర్ 7 రాత్రి 11 గంటల నుండి అక్టోబర్ 8 అర్ధరాత్రి వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలపై నిషేధం అమలు కానుంది.

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో వయోవృద్ధులు, వికలాంగులు, ఎన్‌ఆర్‌ఐలు, చిన్న పిల్లల తల్లిదండ్రులతో సహా అన్ని ఆర్జిత సేవలు మరియు ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

ఈ సమావేశంలో ఎస్‌విబిసి సిఇఓ శ్రీ షణ్ముఖ్‌కుమార్, సిఇ శ్రీ నాగేశ్వరరావు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.