REVIEW MEETING ON GOSALA HELD_ ఎస్వీ గోసంర‌క్ష‌ణ‌శాల‌పై స‌మీక్ష‌

Tirumala, 10 Aug. 19: A review meeting on the development activities pertaining to SV Gosamrakashanasala of TTD was held at Tirumala on Saturday.

The Special Chief Secretary to Government of AP Sri Manmohan Singh held this review meeting at Annamaiah Bhavan along with TTD EO Sri Anil Kumar Singhal.

The Special CS and EO directed CE Incharge Sri Ramachandra Reddy to complete the works of the State of Art Goshala mulled in the sprawling 450acres of land at Palamaneru in a year’s time by drawing timelines.

Later speaking to media Sri Manmohan Singh said, about 40crores have been sanctioned during last board to develop goshala. We had discussed over the progress of works. There are about 39 Desi breeds of Cows in the country. And there is a need to protect all these cows. We will invite tenders for works soon

To bring awareness among people on indigenous cow breeds we are also contemplating “Cow Tourism Project”, he added.

Special Officer of Tirumala Sri AV Dharma Reddy, JEO Tirupati Sri P Basant Kumar, Gosala Director Dr Harnath Reddy were also present.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఎస్వీ గోసంర‌క్ష‌ణ‌శాల‌పై స‌మీక్ష‌

తిరుమల, 2019 ఆగస్టు 10: టిటిడి ఎస్వీ గోసంర‌క్ష‌ణ‌శాల‌కు సంబంధించిన అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌పై తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శ‌నివారం స‌మీక్ష జ‌రిగింది.రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్రీ మ‌న్మోహ‌న్ సింగ్‌తో క‌లిసి టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ ఈ స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ ప‌ల‌మ‌నేరులో 450 ఎక‌రాల్లో విస్త‌రించిన గోశాల‌ను ఇత‌ర గోశాల‌ల‌కు ఆద‌ర్శంగా, ఉన్న‌తంగా తీర్చిదిద్దాల‌ని, ఇందుకోసం సంవ‌త్స‌రంలోపు అన్ని ప‌నులు పూర్తి చేయాల‌ని ఇన్‌చార్జి చీఫ్ ఇంజినీర్ శ్రీ రామ‌చంద్రారెడ్డికి సూచించారు.

రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్రీ మ‌న్మోహ‌న్ సింగ్ మాట్లాడుతూ ప‌ల‌మ‌నేరులో అన్ని వ‌స‌తుల‌తో గోశాల నిర్మాణానికి గ‌తంలో టిటిడి బోర్డు రూ.40 కోట్లు కేటాయించింద‌న్నారు. గోశాలలో అభివృద్ధి ప‌నులు ఎంత‌మేర‌కు జ‌రిగాయ‌న్న విష‌యంపై స‌మీక్ష నిర్వ‌హించిన‌ట్టు తెలిపారు. ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు త్వ‌ర‌లో టెండ‌ర్లు పిలిచి నిర్ణీత వ్య‌వ‌ధిలో పూర్తి చేస్తామ‌న్నారు. అదేవిధంగా, హిందూ ధ‌ర్మంలో గోవుకు విశేష ప్రాధాన్యం ఉంద‌ని, దేశంలో దాదాపు 39 దేశ‌వాళి గోజాతులు ఉన్నాయ‌ని తెలిపారు. దేశ‌వాళి గోవుల సంర‌క్ష‌ణ‌తోపాటు వాటి ప్ర‌త్యేక‌త‌ను భ‌క్తులంద‌రికీ తెలిపేలా గోప‌ర్యాట‌క ప్రాజెక్టును చేప‌డ‌తామ‌ని చెప్పారు. ఇందుకోసం ప‌లు ఏజెన్సీలు డిజైన్లు రూపొందిస్తున్నాయ‌ని, త్వ‌ర‌లో బోర్డు అనుమ‌తి తీసుకుని టెండ‌ర్లు పిలిచి ఈ ప‌నులు కూడా చేప‌డ‌తామ‌ని వివ‌రించారు. బెంగ‌ళూరులో హైవేలో ప‌ల‌మ‌నేరు గోశాల ఉంద‌ని, యాత్రికులు ఇక్క‌డ కొంత‌సేపు ఆగి దేశ‌వాళీ గోవుల‌ను చూసేలా ప‌లు వ‌స‌తులు క‌ల్పిస్తామ‌న్నారు.

ఈ స‌మావేశంలో టిటిడి తిరుమ‌ల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, గోశాల సంచాల‌కులు డా. హ‌ర‌నాథ‌రెడ్డి పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.