TULASI UTSAVAM ON AUGUST 12_ ఆగస్టు 12న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తులసి మహత్యం ఉత్సవం
Tirupati, 10 Aug. 19: Tulasi festival will be observed in Sri Govindaraja Swamy temple on August 12 in Tirupati.
As a part of it, there will be a procession of Sri Govindaraja Swamy on Garuda Vahanam between 7 30 am and 8.30am while in the evening the Asthanam will be performed in the temple between 9 pm and 10 pm where Tulasi Mahatyam will be rendered.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఆగస్టు 12న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తులసి మహత్యం ఉత్సవం
తిరుపతి, 2019 ఆగస్టు 10: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆగస్టు 12వ తేదీ సోమవారం తులసి మహత్యం ఉత్సవం ఘనంగా జరుగనుంది. స్వామివారికి తులసి దళం అత్యంత ప్రీతికరమైనది. శ్రావణ శుద్ధ ద్వాదశినాడు తులసి ఆవిర్భావం జరిగిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా ఉదయం 7.00 నుండి 8.30 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామి వారు గరుడ వాహనాన్ని అధిరోహించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం ఉదయం 9.00 నుండి 10.00 గంటల వరకు స్వామివారి ఆస్థానం ఘనంగా జరుగనుంది. ఇందులో అర్చకులు తులసి మహత్యం పురాణ పఠనం చేస్తారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.