Review Meeting on Sri PAT Brahmotsavam  _ శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు – టీటీడీ ఈవో

Tirupati, 03 November 2010: The Kartheeka Brahmotsavams of Goddess Padmavathi of Tiruchanur will be conducted from December 02 to 10 told Sri I.Y.R.Krishna Rao, Executive Officer, TTDs.

Speaking with media at Sri Padmavathi Guest House, Tirupati on Wednesday evening he informed that Dwajarohanam will be performed between 9.40AM to 10AM on December 2. The Important days of the Brahmotsavams are Gaja Vahanam on December 6, Golden Chariot on December 7, Rathotsavam on December 9 and Panchami Theertham on December 10.

In view of the Brahmotsavams, all Arjitha Sevas are cancelled in the temple he added. He said that a number of cultural troupes will make the devotees ecstacy with their best performances in the Mada streets. All these cultural activities will be arranged by DPP, Annamacharya Project, Dasa Sahithya Project. He further said that necessary arrangements will also be made on December 10 due to Panchami Theertham. Live Telecast of Brahmotsavams will also be arranged by Sri Venkateswara Bhakti Channel he added.

Earlier, he reviewed with Officials of TTD, Police, Tiruchanur Panchayat at Sri Padmavathi Guest House, Tirupati.  Dr N.Yuvaraj, Joint Executive Officer, Sri Bhaskar Reddy, F.A&C.A.O, Sri M.K.Singh, C.V&S.O, Sri Ravindra, Supdt Of Police (Urban), Sri Chandrasekhar Reddy, Chief Engineer, Sri Ramachandra Reddy, Supdt Engg, Sri Munirathnam Reddy, DyEO(PAT), Sri Sivakumar Reddy, Addl C.V&S.O and other TTD, RTC, Police officials were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు – టీటీడీ ఈవో

తిరుపతి, 2010 నవంబర్‌ 03: తిరుచానూరులో వెలసిన శ్రీపద్మావతీ అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాలు డిశెంబర్‌ 2వ తేది నుండి 10వ తేది వరకు కన్నులపండుగగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు ముందస్తుగా చేయాలని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఐ.వై.ఆర్‌. కృష్ణారావు చెప్పారు. బుధవారం సాయంత్రం స్థానిక శ్రీ పద్మావతి అతిధిగృహంలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లుపై అధికారులతో ఆయన సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలను తిలకించడానికి విచ్చేసే భక్తులను అలరించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని ఆయన ధర్మప్రచారపరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్ట్‌, దాససాహిత్య ప్రాజెక్ట్‌, ఎస్‌.వి.సంగీత కళాశాల అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలు రద్దుచేయాలని ఆయన ఆలయ అధికారులను ఆదేశించారు. అవసరమైన ఇంజనీరింగ్‌ పనులు వేగవంతం చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను, గ్రామ పంచాయితి అధికారుల సహకారంతో ఆలయం, మాడవీధులంతా పరిశుభ్రంగా వుంచడానికి చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా భక్తుల భద్రతను దృష్ఠిలో వుంచుకొని అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు అధికారులను కోరారు.

ఈ సమావేశంలో జెఇఓలు డాక్టర్‌ యన్‌.యువరాజ్‌, శ్రీ పి. భాస్కర్‌, ముఖ్య భద్రతాధికారి శ్రీ ఎం.కె.సింగ్‌, అర్బన్‌ ఎస్‌.పి. శ్రీ రవీందర్‌, తిరుచానూరు గ్రామ సర్పంచ్‌ శ్రీ రాజన్‌, ఇతర తితిదే, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.