REVIEW OF TTD JEO ON PRESIDENT VISIT TO TIRUMALA _ భారత రాష్ట్రపతి గౌ|| శ్రీ రామ్‌నాథ్ కోవింద్ తిరుమల పర్యటన ఏర్పాట్లపై తిరుమల ఇన్‌చార్జ్ జెఈవో సమీక్ష
Tirumala, 10 July 2019: TTD Joint Executive Officer In charge of Tirumala Sri P Basant Kumar has directed all officials to make fool proof arrangements for scheduled visit of Honourable President Of India Sri Ramnath Kovind to Tirumala on July 13-14.
Addressing a review meeting on Wednesday at Annamaiah Bhavan in Tirumala with TTD,Revenue and Police officials the JEO said the Honourable President would reach Sri Padmavathi guest house ,Tirumala on July 13,Saturday evening.
He said the President will first have darshan at Sri Varahaswami temple and later Srivari temple on Sunday morning.
The JEO asked officials to explore past experiences of such VVIPS visits of Srivari temple,Reception,Engineering,Anna Prasadam,FMS,Health and Public Relations,Medical, Kalyana Katta etc and coordinate all arrangements.
He directed officials to keep Tirumala surroundings spick and span, place cranes on ghat roads,and battery vehicles near Srivari temple and avert traffic congestion in Tirumala. He also interacted with TTD senior officials , District revenue,police officials and urged to coordinate all arrangements.
Speaking on ocassion District collector Dr Narayana Bharat Gupta said all security,accommodation,and darshan arrangements are being made for visit of Honourable President,Dr Ramnath Kovind, Governor of AP and Telangana Honourable Sri ESL Narasimhan ,AP Chief Minister Honourable Sri Y S Jaganmohan Reddy and others .
The JEO along with District Collector, ––senior police and TTD officials also inspected the route of Presidents visit and made several suggestions.
Tirupati Urban Superintendent Of police Sri Anburajan ,TTD CVSO Sri Gopinath Jetty, Special grade DyEO Smt Parvati, Srivari temple DyEO Sri Harindranath,Health Officer Dr R R Reddy,VSO Sri Manohar and others participated.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
భారత రాష్ట్రపతి గౌ|| శ్రీ రామ్‌నాథ్ కోవింద్ తిరుమల పర్యటన ఏర్పాట్లపై తిరుమల ఇన్‌చార్జ్ జెఈవో సమీక్ష
తిరుమల, 2019 జూలై 10 ; భారతదేశ ప్రధమపౌరులు రాష్ట్రపతి గౌ|| శ్రీ రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 13, 14వ తేదీలలో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై తిరుమల ఇన్‌చార్జ్ జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్ సమీక్ష నిర్వహించారు. బుధవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో టిటిడి, రెవిన్యూ, పోలీసు అధికారులతో ఆయన సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రపతి గౌ|| శ్రీ రామ్‌నాథ్ కోవింద్‌కు తిరుమలలో ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జెఈవో ఆదేశించారు. ముందుగా జూలై 13వ తేదీ శనివారం సాయంత్రం శ్రీ పద్మావతి అతిథి గృహం చేరుకుంటారన్నారు. జూలై 14వ తేదీ ఆదివారం ఉదయం వరాహస్వామి ఆలయం దర్శనం, అటు తరువాత శ్రీవారిని దర్శించుకోనున్నారని ఆయన తెలియచేశారు. తిరుమలలో పటిష్ఠ భద్రత నేపధ్యంలో టిటిడి అధికారులు సమన్వయంతో ముందుగానే అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. శ్రీవారి ఆలయం, రిసెప్షన్, ఇంజినీరింగ్, అన్నప్రసాదం, ఎఫ్‌ఎంఎస్, ఆరోగ్య విభాగం, ప్రజాసంబంధాలు, వైద్యం, కల్యాణకట్ట తదితర విభాగాల వారీగా సమీక్షించి ఏర్పాట్లపై చర్చించారు.
ఆయా శాఖల అధికారులందరూ తమ సిబ్బందిని అప్రమత్తంగా ఉండేలా చూసుకోవాలన్నారు. తిరుమలలో పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా ఆరోగ్యశాఖాధికారి నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఘాట్‌రోడ్లలో క్రేన్‌లు అందుబాటులో ఉంచుకోవాలని, అవసరమైన బ్యాటరీ వాహనాలు ఉండేలా చూడాలని రవాణాశాఖాధికారులను ఆదేశించారు. తిరుమలలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.
తిరుమలలోని టిటిడి ఉన్నతాధికారులు, పోలీసు, రెవిన్యూశాఖల అధికారులతో శాఖలవారీగా ఆయన సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టరు డా.. నారాయణ్ భరత్ గుప్తా మాట్లాడుతూ జూలై 13, 14,15వ తేదీలలో భారత రాష్ట్రపతి గౌ|| శ్రీ రామ్‌నాథ్ కోవింద్, తెలుగు రాష్ట్రాల గవర్నర్ గౌ|| శ్రీ ఇఎస్‌ఎల్.నరసింహన్, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్నారన్నారు. ఇందుకు అవసరమైన భద్రతా, వసతి, దర్శనం తదితర ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించినట్లు వివరించారు.
అనంతరం జెఈవో, జిల్లా కలెక్టరు, ఇతర సీనియర్ అధికారులతో కలిసి గౌ|| రాష్ట్రపతి ప్రయాణించే మార్గాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు.
ఈ సమావేశంలో తిరుపతి అర్బన్ ఎస్పీ శ్రీ అన్బురాజన్, టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాధ్ జెట్టి, ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఆరోగ్యశాఖాధికారి డా..ఆర్.ఆర్.రెడ్డి, విఎస్‌వో శ్రీ మనోహర్, తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.