JYESTABHISEKAM AT SRI GT FROM 12-14 _ జూలై 12 నుండి 14వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం
Tirupati ,10 July 2019: The Jyestabhisekam, the annual holy ritual of cleaning of utsava idols will be held at TTD local temple of Sri Govindarajaswamy temple from July 12-14 .
As part of the spectacular event the gold kavacham Of utsava idols of Sri Govindarajaswamy and his consorts Sridevi and Bhudevi would be removed and replaced after cleaning with herbal aromatic liquids.
On July 12 Kavachadivasam, July 13 kavacha Prathishta and July 14 kavacha samarpana will be performed to idols ,during Ashada month on the day of Jyesta nakshatram TTD organised Vedic rituals like Maha Shanti homam, Punyavachanam and snapana thirumanjanam also.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జూలై 12 నుండి 14వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం
జూలై 10, తిరుపతి, 2019 ; టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 12 నుండి 14వ తేదీ వరకు మూడు రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం(అభిధేయక అభిషేకం) జరుగనుంది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు ఏడాదికోసారి స్వర్ణకవచాలను తొలగించి శుద్ధి చేసి తిరిగి అమర్చుతారు.
ఇందులో భాగంగా జూలై 12న కవచాధివాసం, జూలై 13న కవచ ప్రతిష్ఠ, జూలై 14న కవచ సమర్పణ నిర్వహిస్తారు. ఈ ఉత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు ఉదయం మహాశాంతి హోమం, పుణ్యాహవచనం చేపడతారు. ఉదయం 10 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం, మధ్యాహ్నం శతకలశస్నపనం, సాయంత్రం వీధి ఉత్సవం నిర్వహిస్తారు. ప్రతి ఏడాదీ ఆషాడ మాసం, జ్యేష్ఠా నక్షత్రం రోజున ఆలయంలో జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.