REVIEW ON DISASTER MANAGEMENT PLAN HELD _ తిరుమలకు భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి: అధికారులతో టీటీడీ ఈఓ శ్రీ జె.శ్యామల రావు
TIRUMALA, 14 OCTOBER 2024: A review meeting on Disaster Management was held by the TTD EO along with the Additional EO Sri Ch Venkaiah Chowdary and other officials virtually on Monday.
During the review meeting the EO said, in view of the high alerts of heavy downpour in the next 36 hours sounded by the Meteorological Department, all the departments in Tirumala should be cautious and ready with action plans to counter disasters if any. “The 700-page Disaster Management Plan by TTD is well designed and needs some more refinement in some areas”
The EO said, he will act the Chief of the Disaster Management Executive Committee and since the entire Disaster Management Plan is related to Tirumala, the Additional EO will be the Chairperson of the Disaster Management Co=ordination Committee. Besides there will be Disaster Management Response Force where in the ground level staff belonging to various departments in Tirumala who will execute their works with preparedness. Their entire action plan will be supervised by the Additional EO.
The TTD EO said keeping in view the past experiences, a Hazard Specific Plan has been designed last year and instructed the concerned that there should be a Hazard Specific Hand Book for Floods, lightnings and thunders, landslides and the Chief Engineer of TTD should immediately commence a Whatsapp group for better communication with all. He also said Channel 10 in the communication (Manpacks) will be exclusively used for Disaster Management and instructed the CVSO to keep ready necessary equipment for communication.
The EO directed the Temple, Fire, Medical, Health, Transport, IT, Engineering, Vigilance wings to be extra alert and prepared with their equipment in the case of emergency. “The power backup mechanism should be strong and diesel to be kept in store. Similarly, the IT department should be ready with an alternate mechanism of issuing darshan, accommodation, prasadam and other facilities in the case of power failures due to heavy downpour. The Engineering wing should check the gates of dams, keep ready the machanism in the case of fall of boulders on the Ghat Roads”, he maintained.
Later the Additional EO said, keeping in view the past experiences in the larger interests of the devotees, wide publicity should be given through SVBC, Public Relations Department, Social Media Platforms.
JEOs Smt Goutami, Sri Veerabrahmam, CVSO Sri Sridhar, CE Sri Satyanarayana and other senior officers from various departments were also present in the meeting.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలకు భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి: అధికారులతో టీటీడీ ఈఓ శ్రీ జె.శ్యామల రావు
తిరుమల, 2024 అక్టోబరు 14: తిరుపతికి భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఈఓ శ్రీ జె.శ్యామల రావు ఆదేశించారు. విపత్తు నిర్వహణ ప్రణాళికపై టీటీడీ అడిషనల్ ఈఓ శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి ఆయన అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ 48 గంటల్లో తిరుపతిలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందనే వాతావరణశాఖ ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో అధికారులందరూ విపత్తును ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని కోరారు.
2021లో భారీ కొండ చరియలు విరిగి పడిన ఘటనతో టీటీడీ 700 పేజీల విపత్తు నిర్వహణ ప్రణాళిక రూపొందించిందన్నారు. ఈ ప్రణాళిక బాగుందనీ, మరింత మెరుగు పరచాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు. ఈఓ స్థాయిలో విపత్తుల నివారణ ఎగ్జిక్యూటివ్ కమిటీ, అడిషనల్ ఈఓ ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణ సమన్వయ కమిటీ ఉందన్నారు. అగ్నిమాపక శాఖ, ఆరోగ్య శాఖ, విజిలెన్స్ విభాగం, ఇతర కీలకమైన శాఖల విభాగాధిపతులు, తమ సిబ్బందితో డిజాస్టర్ మేనేజ్మెంట్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
కొండ చరియలపై ప్రత్యేక నిఘా ఉంచాలనీ, ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ శాఖ విద్యుత్తు అంతరాయ పరిస్థితిల్లో జనరేటర్లు నడపడానికి ముందస్తు జాగ్రత్తగా తగినంత డీజిల్ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఐటీ విభాగం భక్తులకు వసతి, దర్శనం, ప్రసాదాల కార్యాకలాపాలకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.
విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే చర్యల్లో భాగంగా వైద్య శాఖ అంబులెన్సు లను అందుబాటులో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంజనీరింగ్ విభాగం డ్యామ్ గేట్లను పర్యవేక్షించాలనీ, ఘాట్ రోడ్డులలో జేసీబీ, ట్రక్కులు, ట్రాక్టర్లు తగిన సిబ్బందిని సంసిద్ధంగా ఉంచుకుని సమాయత్తంగా ఉండాలని చెప్పారు. ట్రాఫిక్ పోలీసులు ఇంజినీరింగ్ సిబ్బందితో సమన్వయం చేసుకుని పని చేయాలన్నారు. ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైతే అగ్ని మాపక సిబ్బంది వేగంగా స్పందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
ప్రజా సంబంధాల విభాగం వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఎస్వీబీసీ, మీడియా, టీటీడీ సోషియల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తూ భక్తులను అప్రమత్తం చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో టీటీడీ జేఈఓలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీధర్, సిఈ సత్య నారాయణ, ఇతర విభాగాధిపతులు, జిల్లా పోలీసు మరియు రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.