REVIVE FMS SERVICES AT TIRUMALA IMMEDIATELY- TTD ADDITIONAL EO TO AGENCIES _ తిరుమ‌ల‌లో ఎఫ్ఎమ్ఎస్ ఏజెన్సీ సేవ‌లు వెంట‌నే పునరుద్ధరించాలి – టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

Tirumala, 07 December 2021: TTD Additional EO Sri AV Dharma Reddy has directed that all the FMS agencies should revive their services deploying adequate staff to clear the garbage and ensure that devotees do not face any issues at Tirumala.

Addressing a review meeting on FMS activities with the representatives of various FMS Agencies and TTD officials at Annamaiah Bhavan in Tirumala on Tuesday the TTD Additional EO said for a few days the sanitary workers of FMS agencies were on dharna demanding their absorption with TTD corporation and as a result devotees at Tirumala and Tirupati are facing hardships.

He said if the FMS agencies fail to address the issue within three days by appointing new workers the TTD will initiate departmental action against such agencies and would hand over the functions to a new agency.

He also instructed the TTD health department to appoint adequate staff for clearing garbage etc. at Tirumala and Tirupati to ensure better service to devotees.

SE-2 Sri Jagadeeshwar Reddy, Health Officer Dr Sridevi, FMS EE Sri Ravi Shankar Reddy, Reception wing DyEOs Sri Lokanatham and Sri Bhaskar, representatives of several FMS agencies and other officials were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తిరుమ‌ల‌లో ఎఫ్ఎమ్ఎస్ ఏజెన్సీ సేవ‌లు వెంట‌నే పునరుద్ధరించాలి – టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుమల, 2021 డిసెంబర్ 07: తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తుల‌కు ఎలాంటి పారిశుద్ధ్య స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా ఎఫ్ఎమ్ఎస్ ఏజెన్సీలు ప్ర‌త్య‌మ్నాయ చ‌ర్య‌ల తీసుకొని త‌గినంత మంది సిబ్బందితో వెంట‌నే సేవ‌లు పునరుద్ధరించాల‌ని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి ఆదేశించారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో మంగ‌ళ‌వారం ఉద‌యం అద‌న‌పు ఈవో టిటిడి అధికారులు, ఎఫ్ఎమ్ఎస్ ఏజెన్సీల ప్ర‌తినిధుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ గ‌త కొద్ది రోజులుగా ఎఫ్ఎమ్ఎస్ ఏజెన్సీలలో ప‌ని చేసే పారిశుద్ధ్య కార్మికులు టిటిడి కార్పోరేష‌న్‌లో క‌ల‌పాల‌ని కోరుతూ తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో విధుల‌కు హాజ‌రు కాకుండా ధ‌ర్నా నిర్వ‌హిస్తున్నార‌న్నారు. ఈ కార‌ణంగా శ్రీ‌వారి భ‌క్తుల‌కు తిరుమ‌ల, తిరుప‌తిల్లో తీవ్ర ఇబ్బందులు క‌లుగుతున్నాయ‌ని తెలిపారు. రాబోవు రెండు మూడు రోజుల్లో అన్ని ఎఫ్ఎమ్ఎస్ ఏజెన్సీలు కొత్త‌వారితో ఖాళీలను భ‌ర్తీ చేసి భ‌క్తుల‌కు పూర్తి స్థాయిలో సేవ‌లందించాల‌ని ఆదేశించారు. సేవ‌లందించ‌ని ఏజెన్సీలపై శాఖా ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకొని, కొత్త ఏజెన్సీలకు అప్ప‌గిస్తామ‌న్నారు.

ఎఫ్ఎమ్ఎస్ ఏజెన్సీలు స్పందిచ‌ని ఎడ‌ల తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో భ‌క్తుల‌కు సేవ‌లందించేందుకు టిటిడికి అవ‌స‌ర‌మైన పారిశుద్ధ్య కార్మికుల‌ను ఆరోగ్య విభాగం ద్వారా నియ‌మించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు.

ఈ స‌మావేశంలో ఎస్ఇ- 2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, ఆరోగ్య విభాగం అధికారిణి డా.శ్రీ‌దేవి, ఎఫ్ఎమ్ఎస్ ఇఇ శ్రీ ర‌వి శంక‌ర్ రెడ్డి, వ‌స‌తి విభాగం డెప్యూటీ ఈవోలు శ్రీ లోక‌నాథం, శ్రీ భాస్క‌ర్‌, వివిధ ఎఫ్ఎమ్ఎస్ ఏజెన్సీల ప్ర‌తినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.