RUSSIANS ADMIRE NADARCHANA _ కపిలతీర్థంలో ఆకట్టుకున్న నవ వాయులీన నాదార్చన 

TIRUPATI, 19 FEBRUARY 2023: The entire premises in Kapileswara Swamy temple danced to the rhythmic beats of Nava Vayulina Nadarchana.

As part of the annual brahmotsavams in Sri KT, on Sunday evening the SV College of Music and Dance students performed Bharatnatyam which allured the foreign devotees who hailed from Russia.

Earlier Harikatha Parayanam was also rendered.

Special Officer of SVMDC Sri Sesha Sailendra, Principal Sri Sudhakar and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

కపిలతీర్థంలో ఆకట్టుకున్న నవ వాయులీన నాదార్చన

 తిరుపతి, 2023 ఫిబ్రవరి 19: శ్రీకపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయం వద్ద ఆదివారం నిర్వహించిన నవ వాయులీన నాదార్చన భక్తులను ఆకట్టుకుంది. ఎస్వీ సంగీత, నృత్య కళాశాల, నాదస్వరం పాఠశాల, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మధ్యాహ్నం 2 నుండి రాత్రి 9 గంటల వరకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ముందుగా హరికథ పారాయణం జరిగింది. అనంతరం ఎస్వీ నాదస్వర పాఠశాల ఉపాధ్యాయులు శ్రీ కృష్ణారావు బృందం డోలు, శ్రీ మునిరత్నం, శ్రీ కృష్ణమూర్తి బృందం నాదస్వరం వాయిద్యాలతో మంగళధ్వని వినిపించారు.

కళాశాల అధ్యాపకులు శ్రీ కె.వి కృష్ణ బృందం వాయిలీనంపై, శ్రీ శంకర్, శ్రీ రమేష్ మృదంగాలపై నవ వాయులీన నాదార్చనను చక్కగా ప్రదర్శించారు. ఇందులో గజాననయతం.., జగదానందకారక…, శివ శివ శినయనరాదా…, జయ జయ కరుణాంతరంగ.., నాద తను మనిషం.., వాంఛతోను…, ఎంత మాత్రమున… తదితర కీర్తనలను అద్భుతంగా వాయిద్యాలపై ప్రదర్శించారు.

అదేవిధంగా కళాశాల అధ్యాపకులు శ్రీ సి.హరనాథ్ నృత్య పర్యవేక్షణలో విద్యార్థినులు చక్కగా భరతనాట్యాన్ని ప్రదర్శించారు. ఇందులో విన్నపాలు వినవలె.., దేవ దేవం భజే.., కమల లోచన…, చేరి యశోదకు…, కంటిమి నేడితే గరుడాచలపతి…, కట్టెదురా వైకుంఠము…, ఆడరమ్మా పాడరమ్మా… తదితర కీర్తనలతో పాటు కాలభైరవాష్టకం, శివతాండవం నృత్య ప్రదర్శన చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్వీ సంగీత కళాశాల ప్రత్యేకాధికారి శ్రీ శేష శైలేంద్ర, ప్రిన్సిపాల్ శ్రీ ఎం.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.