DHWAJAVAROHANAM HELD _ ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ క‌ల్యాణ వెంక‌న్న బ్రహ్మోత్సవాలు

TIRUPATI, 19 FEBRUARY 2023: The annual Navahnika Brahmotsavams at Srinivasa Mangapuram concluded on a grand successful note with Dhwajavarohanam on Sunday night.

 

The lowering of Garuda Dhwajam from temple mast was observed amidst the chanting of Vedic mantras as per Vaikhanasa Agama by Pundits.

 

JEO Sri Veerabrahmam, Spl. Gr. DyEO Smt Varalakshmi and others were also present.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ క‌ల్యాణ వెంక‌న్న బ్రహ్మోత్సవాలు

తిరుప‌తి, 2023 ఫిబ్ర‌వ‌రి 19: శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి.

సాయంత్రం 6 గంట‌లకు ఆల‌యంలో బంగారు తిరుచ్చి ఉత్స‌వం, రాత్రి 7 నుండి 8 గంటల మధ్య ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. ధ్వజారోహణం నాడు గరుడాళ్వార్ ఆహ్వానించిన దేవతలను తిరిగి సాగనంపే కార్యక్రమమే ధ్వజావరోహణం. తిరిగి వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఈ సందర్భంగా గరుడాళ్వార్ దేవతలను కోరతాడు. ఈ సందర్భంగా గరుడధ్యానం, భేరిపూజ, భేరితాడనం, గరుడగద్యం, దిక్పాలక గద్యం, గరుడ లగ్నాష్టకం, గరుడ చూర్ణిక అనే ఏడు మంత్రాలను అర్చకులు జపించారు.

ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమ‌తి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గురుమూర్తి, సూపరింటెండెంట్‌ శ్రీ చెంగ‌ల్రాయులు, కంకణ బట్టర్ శ్రీ బాలాజి రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.