SAKSHATKARA VAIBHAVOTSAVAMS CONCLUDES AT SKVST _ గరుడ వాహనంపై శ్రీ కల్యాణ వెంకన్న అభయం
Srinivasa Mangapuram, 8 July 2019: The annual three day Sakshatkara Vaibhavotsavams came to a grand conclusion in the temple of Sri Kalyana Venkateswara Swamy at Srinivasa Mangapuram on Monday.
On the final day, the deities of Sri Kalyana Venkateswara Swamy flanked by Sridevi and Bhudevi were seated on a separate platform and Snapana Tirumanjanam was rendered. In the evening the Lord was taken on a ceremonious procession of Garuda Vahanam along the mada streets.
Temple DyEO Sri Dhananjeyulu and others participated.
Meanwhile on Tuesday, Paruveta Utsavam will be observed by the temple authorities at the Paruvetotsava Mandapam at Srivari Mettu.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
గరుడ వాహనంపై శ్రీ కల్యాణ వెంకన్న అభయం
ముగిసిన సాక్షాత్కార వైభవోత్సవాలు
జూలై 08, తిరుపతి, 2019: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాల్లో చివరి రోజైన సోమవారం రాత్రి స్వామివారు విశేషమైన గరుడ వాహనంపై భక్తులను కటాక్షించనున్నారు.
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు.
అనంతరం సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్‌సేవ జరుగనుంది. ఆ తరువాత లక్ష్మీహారాన్ని ఆలయ ప్రదక్షిణగా అలంకార మండపంలోకి తీసుకొస్తారు. రాత్రి 8 నుండి 9 గంటల వరకు గరుడ వాహనంపై స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. జూలై 9న పార్వేట ఉత్సవం జరుగనుంది.
గరుడ వాహనంపై స్వామివారి కటాక్షం
సాక్షాత్కార వైభవోత్సవాల్లో చివరి రోజు రాత్రి శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు విశేషమైన గరుడవాహనంపై మాడ వీధులలో భక్తులను కటాక్షిస్తారు. గరుడ వాహనంపై ఉన్న శ్రీవారిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. వేదాలు, ఆచార్యులు గరుడుడిని వేదస్వరూపుడిగా పేర్కొన్నారు. గరుత్మంతుని రెక్కలు వేదం నిత్యత్వానికి, అపౌరుషేయత్వానికి ప్రతీకలని స్తుతించారు. గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. ఇందుకే గరుడసేవకు ఎనలేని ప్రచారం, ప్రభావం విశిష్టత ఏర్పడ్డాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ కె.ధనంజయుడు, ఏఈవో శ్రీ డి.లక్ష్మయ్య, సూపరింటెండెంట్లు శ్రీ రమణయ్య, శ్రీ ముని చెంగల్రాయలు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ బి.అనిల్‌కుమార్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.